HBD Ram Charan: స్టార్‌లు ఒక్కటైన స్టార్ వచ్చేశాడు.. కిక్కిచ్చేలా గేమ్ చేంజర్ సాంగ్
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. గతంలో కంటే ఎక్కువ స్థాయికి ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్ 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు.
వరుస హిట్లతో జోష్‌లో ఉన్న రామ్ చరణ్.. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో కలిసి చేస్తున్న సినిమానే 'గేమ్ చేంజర్'. క్రేజీ కాంబినేషన్‌లో పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు కొన్ని కోట్ల బడ్జెట్‌ను కేటాయించి హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాలోని మొదటి పాట 'జరుగండి'ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, అనివార్య కారణాలతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
'గేమ్ చేంజర్' మూవీలోని మొదటి పాటను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ 'జరుగండి'ని రిలీజ్ చేశారు. దీన్ని థమన్ కంపోజ్ చేయగా.. దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చారు.
తాజాగా విడుదలైన 'జరుగండి' సాంగ్ ఎంతో హైలైట్‌గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో కనిపించిన సెట్ చాలా కొత్తగా ఉంది. అలాగే, విజువల్స్, లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టెప్పులు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే, హీరో, హీరోయిన్ లుక్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా ఈ పాట ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











