మాస్ బీట్‌తో కేక పెట్టిస్తున్న 'తస్సాదియ్యా'.. 'వినయ విధేయ రామ' రెండవ పాట వచ్చేసింది!

Recommended Video

ram charan vinaya vidheya rama second song released

మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వినయ విధేయరామ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలు చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ కి గురవుతున్నారు. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 11 న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీనితో చిత్ర యూనిట్ ఆసక్తి పెంచేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. కుటుంబ బంధాలతో సాగీ పాట అందరిని ఆకట్టుకుంది. తాజాగా 'తస్సాదియ్యా' అనే మాస్ సాంగ్ ని విడుదల చేశారు.

దేవిశ్రీ సంగీతం

దేవిశ్రీ సంగీతం

వినయ విధేయరామ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలని అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి సినిమాకు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్స్ అందిస్తుంటాడు. వినయ విధేయ రామ చిత్రానికి కూడా అదిరిపోయే సాంగ్స్ అందిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా తస్సాదియ్యా సాంగ్ ఆకట్టుకుంటోంది.

మంచి మాస్ బీట్

మంచి మాస్ బీట్ తో దేవిశ్రీ ప్రసాద్ ఈపాటని రూపొందించారు. బోయపాటి శ్రీను ఈ పాటని అద్భుతంగా చిత్రీకరించారని దేవిశ్రీ ఇది వరకే తెలియజేసాడు. రాంచరణ్ ఫ్యాన్స్ అంతా చిందేసే విధంగా ఈ పాటలో రాంచరణ్, కైరా అద్వానీ డాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు సంబందించిన స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాంచరణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా, కైరా అద్వానీ హాట్ లుక్ లో అందాలు ఆరబోస్తోంది.

 శ్రీమణి సాహిత్యం

శ్రీమణి సాహిత్యం

శ్రీమణి ఈ పాటకు క్యాచీగా ఉండే లిరిక్స్ అందించాడు. 'తస్సాదియ్యా.. లెట్స్ డూ మామా మియ్యా' అంటూ ఈ పాట సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్, సింగర్ జస్ప్రీత్ జాస్ గాత్రంతో పాట ఎనర్జిటిక్ గా సాగుతోంది. ఈ పాటని లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా కొన్ని మేకింగ్ విజువల్స్ ని కూడా చూపించారు. రాంచరమ్, కైరా అద్వానీ కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తున్నారు.

 షూటింగ్ స్పాట్‌లో మెగాస్టార్

షూటింగ్ స్పాట్‌లో మెగాస్టార్

చూస్తుంటే వీరి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ చరణ్, కైరా చాలా సరదాగా గడుపుతున్నారు. ఈ పాట షూటింగ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి లొకేషన్ లో ఉన్నారు. పాట చిత్రీకరణని బోయపాటితో కలసి గమనిస్తున్నారు. ఈ దృశ్యాలని మేకింగ్ విజువల్స్ లో చూపించారు. మొత్తంగా చూస్తుంటే వినయ విధేయ రామ చిత్రం ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి కంప్లీట్ ప్యాకేజ్ లా కనిపిస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X