వైరస్‌కే వణుకుపుట్టేలా.. కరోనాను బండ బూతులు తిట్టిన వర్మ!
కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని ప్రభావమెట్టిదో ప్రపంచంమొత్తం చూస్తోంది. చిన్నా పెద్దా, పేద, బీద, శ్రీమంతులు అని తేడా లేకుండా అందర్నీ ఇంటికే పరమితం చేసింది. కరోనా వైరస్ ధాటికి అగ్ర రాజ్యాలే అల్లల్లాడుతున్నాయి. మనదేశంలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతూనే ఉంది.
కరోనాను కట్టడి చేసేందుకు దేశ ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సెలెబ్రిటీల చేత చెప్పిస్తూ అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారలంతా వీడియో సందేశాలు రిలీజ్ చేస్తూ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మాస్కులు ధరించాలి, ఇంట్లోనే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కరోనాపై అవగాహన కలిగించేందుకు సంగీతాన్ని సాధనంగా ఎంచుకున్నారు. మొదటగా కోటి స్వరకల్పనలో మెగా ఫ్యామిలీ, నాగార్జున కలిసి ఓ పాటను రిలీజ్ చేశారు. రీసెంట్‌గా కీరవాణి కూడా కరోనాపై పాటను విడుదల చేశారు. తాజాగా వర్మ తన స్టైల్లో కరోనాను బండ బూతులు తిట్టేశాడు.
నికృష్టమైన పురుగు, దరిద్రమైన పురుగు అంటూ దారుణంగా తిడుతూ తన గొంతుతోనే కరోనాను భయపెట్టేశాడు. చేతులు కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, ఇంట్లోనే ఉండండి, దూరం పాటించండి అనే నాలుగు ఆయుధాలతో కరోనాను ఎదురించవచ్చని తెలిపాడు.


Click it and Unblock the Notifications











