VYOOHAM: ఊహించని విధంగా వ్యూహం సాంగ్.. ఆ మంత్రి స్టెప్పులు హైలైట్‌గా!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయ నేపథ్యంతో సాగే రియల్ స్టోరీలతో సినిమాలు చాలానే తెరకెక్కుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలా వస్తున్న చిత్రాల్లో ఎక్కువ శాతం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించినవే అని చెప్పాలి. ఇలా ఎన్నో సినిమాలు రూపొందించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తీస్తున్న మూవీనే 'వ్యూహం'. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
'రంగం' ఫేం అజ్మల్ హీరోగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న పొలిటికల్ డ్రామానే 'వ్యూహం'. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెత్ తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో రాబోతుంది. ఇందులో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన డెవలప్‌మెంట్‌ను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

'వ్యూహం' సినిమాను నవంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇప్పటికే దీని నుంచి టీజర్, టీజర్ 2, ట్రైలర్‌ను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' సినిమా నుంచి 'వైఎస్సార్‌సీపీ' అంటూ సాగే ఓ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
'వైఎస్సార్‌సీపీ.. వైఎస్సార్‌సీపీ' అంటూ సాగే ఈ సాంగ్‌ను ఆనంద్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయగా.. రాహుల్ సిప్లీగంజ్, రోహిణిలు ఆలపించారు. ఈ పాటకు రిక్కీ లిరిక్స్ ఇచ్చారు. ఇందులో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పాత్రలను హైలైట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సంబరాలు చేసుకునే సమయంలో వచ్చే పాటలా ఇది ఉంది. ఇదిలా ఉండగా.. ఈ పాటలో మంత్రి అంబటి రాంబాబును పోలిన వ్యక్తితో అదే రకంగా స్టెప్పులు వేయించడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఈ పాట ఆ పార్టీ అభిమానుల్లో జోష్‌ను నింపేలా ఉంది.
ఇక, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











