బర్త్ డే హంగామా .. డించక్ అంటూ దుమ్ములేపనున్న రామ్
ఎనర్జిటిక్ స్టార్, ఇస్మార్ట్ హీరో రామ్ RED చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అంతా బాగుండి ఉంటే.. ఈ పాటికే చిత్రం విడుదలై థియేటర్లలో బొమ్మ దద్దరిల్లేది. కానీ కరోన వైరస్, లాక్ డౌన్ వల్ల అంతా తారుమారైంది. మధ్యలో ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తారని, ఇక థియేటర్లలో చూడలేమని వార్తలు వచ్చాయి. వీటిపై రామ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, రెడ్ చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే చూస్తారని రూమర్స్‌కు పుల్ స్టాప్ పెట్టేశాడు.
రామ్ పుట్టిన రోజు (మే 15) సెలెబ్రేషన్స్ నిన్ననే మొదలయ్యాయి. రామ్ బర్త్ డే కామన్ డీపీ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. అంతకుముందే రామ్ తన ఫ్యాన్స్‌కు ఓ సందేశాన్ని అందించాడు. 'మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టిన రోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది.

మీకు నాపై ఎంత ప్రేమ ఉందో.. అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిస్థితుల రీత్యా.. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం, నా ఎనర్జీ, నా ప్రాణం, అంతకు మించి నా బాధ్యత' అని పేర్కొన్నాడు.
రామ్ బర్త్ డే కామన్ డీపీపై పీసీ కనెక్ట్స్, పూరీ, ఛార్మీ, శ్రీ విష్ణు, గోపిచంద్ మలినేని, నిధి అగర్వాల్, సురేష్ ప్రొడక్షన్స్, హరీష్ శంకర్ వంటి వారంతా స్పందించారు. తాజాగా రామ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎలా ఉండబోతోన్నాయో ఓ శాంపిల్‌ను వదిలారు. రేపు డించాక్ అనే పాటను విడుదల చేయడంతో రామ్ బర్త్ డే సంబరాలు మొదలవుతాయని యూనిట్ ప్రకటించింది. రేపు ఉదయం పది గంటలకు డించక్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఈ చిత్రానికి మణిశర్మ అందించే సంగీతం అతి పెద్ద బలంగా మారుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











