For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Warrior బుల్లెట్ సాంగ్.. స్టెప్పులతోనే అదరగొట్టిన రామ్ పోతినేని.. దేవి మ్యూజిక్ మరో లెవెల్!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరోలలో రామ్ పోతినేని ఒకరు. రామ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ స్టైల్ లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా లో రామ్ పోతినేని నటించిన విధానం ఏ స్థాయిలో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ లుక్కుతో రామ్ ప్రేక్షకులకు సరికొత్త కిక్కు అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రెడ్ సినిమా తో కూడా పర్వాలేదనిపించిన రామ్ పోతినేని ఈసారి మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మొదటిసారి రామ్ పోతినేని ఒక ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

  తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా మూవీ ది వారియర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా ఇటీవల మొదలుపెట్టారు. అయితే సినిమాలోని మొదటి పాట తోనే చిత్ర యూనిట్ సభ్యులు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లెట్ లిరికల్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితమే చెన్నైలో విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ వేడుకలో తమిళం హీరో, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ లో రామ్ పోతినేని అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

  అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. యువ హీరోయిన్ కృతిశెట్టి కూడా మొదటిసారి విభిన్నమైన డాన్స్ స్టెప్పులతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ పాటను తెలుగులో శ్రీమణి రాయగా ప్రముఖ తమిళ హీరో శింబు పాడడం విశేషం. ఇది వరకే శింబు సింగర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.

  తెలుగులో కూడా అతను కొన్ని సినిమాల్లో పాడడం జరిగింది. ఇక ఇప్పుడు రామ్ పోతినేని కోసం ప్రత్యేకంగా అతను పాడిన బుల్లెట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ పోతినేని ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు లింగుస్వామి రామ్ పోతినేనిని గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త లుక్కుతో చూపిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

  ram pothineni the warrior movie bullet lyrical video song released

  తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా మధ్యలో షూటింగ్ కు కొంత కు బ్రేక్ పడింది. ఇక మొత్తానికి జూన్ 14వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ పోతినేని ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

  English summary
  ram pothineni the warrior movie bullet lyrical video song released
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X