The Warriorr: బుల్లెట్ సాంగ్ మరో సంచలన రికార్డు.. రామ్ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రతి సినిమాతో విభిన్నంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ అనంతరం అతని ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది. కేవలం క్లాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా రామ్ కథలను చేసుకుంటున్నాడు. ఇక అతను ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద మంచి హైప్ ఐతే క్రియేట్ చేస్తున్నాయి.
ఇక తదుపరి సినిమాను లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ది వారియర్ అనే ఆ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. కృతి శెట్టి ఈ ప్రాజెక్టులో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ నిజంగానే బుల్లెట్ తరహాలో దూసుకుపోతోంది అనే చెప్పాలి. ఇప్పటికే యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూవ్స్ అందుకని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను ప్రముఖ తమిళ హీరో శింబు పాడిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఇక బుల్లెట్ సాంగ్ ఇప్పుడు ప్రముఖ మొజ్ యాప్లో కూడా 11 బిలియన్ల సార్లు ప్లే అవుతూ సరికొత్త రికార్డును దక్కించుకోవడం మరొక విశేషం అనే చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వస్తుంది. కేవలం పాటతోనే ఈ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని ఇక ఈ సినిమాతో ఇంకా ఈ స్థాయిలో ఆకట్టుకుంటాడో అని ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ది వారియర్ సినిమాను జూలై 14న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమాతో రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడు అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో మొదటి సారి ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా పూర్తి స్థాయిలో మాస్ కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











