కష్టాన్ని కమ్మదనంగా మార్చి.. కష్టేఫలి అంటూ రామ్‌జో ఎమోషనల్ ట్వీట్
రామ జోగయ్య శాస్త్రి పేరు, ఆయన రాసిన పాటలు వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ మధ్య కాలంలో అయితే రామ జోగయ్య శాస్త్రి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. బుట్టబొమ్మ పాటతో అందర్నీ ఆకట్టుకున్న రామ్‌జో.. తాజాగా వకీల్ సాబ్ మొదటి సాంగ్‌తో మరోసారి తన కలం పదునును చూపెట్టాడు.
మగువా మగువా అంటూ మహిళా దినోత్సవం రోజున రిలీజ్ చేసిన పాట వైరల్‌గా మారింది. ఆ పాటలో మహిళల గొప్పతనాన్ని వివరించే సాహిత్యాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు పవన్ ఫ్యాన్స్. ఇక తక్కువ కాలంలో ప్రపంచంలోని టాప్ లిస్ట్‌లోకి మగువా మగువా అనే పాట చేరిపోయింది.

తాజాగా రామ్‌జో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 'ప్రొడక్షన్నుండి ఫోన్ వస్తుందని భయపడుతూ .. ఆలస్యం అవుతోందే అని బాధపడుతూ.. ఇంకా బాగా రాయాలని మథనపడుతూ ..
పూర్తిచేసిన పాట.. ఒకరోజు తీయగా వినపడుతుంది.. నలుగురికీ నచ్చుతుంది.. కష్టాన్ని కమ్మదనంగా మార్చి ప్రాణం తేలికపడేలా చేస్తుంది..కష్టేఫలి' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇది వకీల్ సాబ్ రెండో పాట కోసమా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











