సందర్భాన్ని బట్టే ఆ పాట.. ‘వకీల్ సాబ్’పై రామజోగయ్య శాస్త్రి కామెంట్స్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొదటగా మ్యూజికల్ జర్నీతోనే వకీల్ సాబ్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఇందులో మగువా మగువా, సత్యమేవ జయతే పాట గురించి రామజోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా సత్యమేవ జయతే మీద ఎన్ని రకాల కామెంట్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో వాటిపై వచ్చిన మీమ్స్‌ను కూడా టచ్ చేశారు.

సత్యమేవ జయతే అనే పాట వకీల్ సాబ్ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి రాసినట్టుంది.. ఆయన్ను పొగుడుతూ ఉన్నట్టుందని రకరకాల కామెంట్లు చేశారు. వీటిపై రామజోగయ్య శాస్త్రి ఆ మధ్య వేసిన ట్వీట్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి. సినిమా చూశాక మాట్లాడుకుందాం సరేనా? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. తాజాగా మరోసారి దానిపై వివరణ ఇచ్చారు.

Rama Jogayya sastry about pawan kalyan Vakeel Saab Satyameva Jayate Song

సత్యమేవ జయతే సినిమా మీద చాలా రకాల కామెంట్లు వచ్చాయి.కానీ నేను ఆ పాటను సినిమాలోని సందర్భాన్ని బట్టే రాశాను. కానీ పవన్ కళ్యాణ్‌కు బయట ఉన్న ఇమేజ్.. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన స్థాయిని బట్టి మీకు అలా అనిపించవచ్చు.. అది బోనస్.. అది మీ అభిమానం.. కానీ నేను మాత్రం సినిమాలోని సందర్భానికి తగ్గట్టే పాటను రాశాను అని రామ జోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X