Just In
- 51 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 2 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: ఔటైన అసహనం.. కుర్చీపై విరాట్ కోహ్లీ కోపం! వీడియో
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- News
కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మ్యాజికల్ డేట్.. సిరివెన్నెల ప్రశంసలపై రామజోగయ్య శాస్త్రి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలోని లాహే లాహే పాట ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రిపై రెండు మూడు రోజులుగా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ పాటలోని సాహిత్యాన్ని, మాధుర్యాన్ని ఆస్వాధిస్తూ పాట రచయిత మీద అభిమానాన్ని చాటుతున్నారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఓ విషయాన్ని చెప్పారు.
చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా
తన గురువైన సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఫోన్ చేసి అభినందించారట. ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేను అని ఎమోషనల్ అయ్యారు. మార్చి 31 మ్యాజికల్ డేట్ అంటూ తన గురువు ప్రశంసలను గుర్తుకు తెచ్చుకున్నారు. కాసర్ల శ్యాం, సిరాశ్రీ, లక్ష్మీ భూపాల్ వంటి వారు ఫోన్ చేసి అభినందించారని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. అలా అందరిలోకెల్లా సిరివెన్నెల గురువు గారు చెప్పిన మాటలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.

నీ విజయం నాకన్నా ఎవరికి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది చెప్పు అని అన్నారు. ఆ మాట చాలు ఎంతో గొప్పగా అనిపించిందంటూ రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి ఆచార్య లోని ఈ మొదటి పాట అయినా లాహే లాహే లిరికల్ వీడియో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఇక ఈ నెలలో మరిన్ని పాటలు వదిలేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది.