మంచు మనోజ్ విజన్‌కు హ్యాట్సాఫ్.. ‘అహం బ్రహ్మాస్మి’పాటల సిట్టింగ్‌లో రామ్‌జో
మంచు మనోజ్ చాలా కాలం తరువాత మేకప్ వేసుకునేందుకు సిద్దమయ్యాడు. ఒక్కడు మిగిలాడు అంటూ చివరగా చేసిన ప్రయత్నం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆపై వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలతో సతమతమైన ఈ హీరో అన్ని బంధనాలను తెంచుకున్నట్టు ప్రకటించాడు. ఇకపై తన పూర్తి జీవితం సినిమాలతోనేనని చెప్పుకొచ్చాడు.
మంచు మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకులతో తన వివాహ బంధం ముగుస్తోందని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వస్తుందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని రాసుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి తన దృష్టంతా సినిమాలపైనే పెట్టాడు.

ఆ క్రమంలోనే మంచు మనోజ్ ఆర్ట్స్‌ను స్థాపించాడు. అందులో మొదటి ప్రాజెక్ట్‌గా అహం బ్రహ్మాస్మిని జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. తాజాగా ఈ మూవీ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి అహం బ్రహ్మాస్మి పాటల సిట్టింగ్‌లో మంచు మనోజ్‌తో కూర్చున్నట్టు ట్వీట్ చేశాడు. అతని విజన్, పెద్ద ఎత్తున సినిమాను తెరెక్కించాలన్న తపన, అతని హార్డ్ వర్కింగ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని రాసుకొచ్చాడు. సంగీత దర్శకుడు అచ్చుతో ఎప్పుడైనా మిరాకిలే మనోజ్‌తో ఇంక ఫైర్ మీదున్నట్టేనని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











