జూనియర్ ఎన్టీఆర్ ఆయుధ పూజ.. చూసి ఏడ్చేసిన ఫేమస్ రైటర్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభావాన్ని చూపించి.. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చుకున్న హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. దీనికితోడు దాదాపు ఆరేడేళ్లుగా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. RRR తర్వాత అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు. దీంతో ఫుల్ జోష్‌తో వరుసగా మూవీలు చేస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు.

'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కలయికలో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 90 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను, పాటలను ఒక్కొక్కటిగా వదలాలని ప్లాన్ చేస్తోంది. ఇలా ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి X ఖాతాలో 'నిన్న రాత్రి నేను ఆయుధపూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే.. పక్క నుంచి మా కొరటాల శివ గారు డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలే అన్నారు. ఆదే మాట మీతో అన్నా నిజ్జంగా నిజ్జం' అని ట్వీట్ చేశారు. తద్వారా 'దేవర' చిత్రంలో ఆయుధ పూజ సాంగ్ గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. సక్సెస్ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











