BulBul Tarang Lyrical: సిద్ శ్రీరామ్ మరో మాయాజాలం.. అదిరిపోయిన రవితేజ సాంగ్

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసి.. సుదీర్ఘ కాలం పాటు కష్టనష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. మొదట్లోనే తనదైన సినిమాలతో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను విపరీతంగా అలరించి మాస్ మహారాజా అనే బిరుదుతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కమర్షియల్ హీరోగా మారిపోయి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి రవితేజ వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ హవాను చూపిస్తున్నాడు.

ఆ మధ్య చాలా కాలం పాటు మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది సంక్రాంతికి 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్‌ ఎక్కాడు. ఇది అతడికి విజయాన్ని అందించడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా రవితేజ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌‌ను ఖాతాలో వేసుకున్నట్లైంది. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భారీ నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే.

Ramarao On Duty BulBul Tarang Lyrical Released

'ఖిలాడీ' పట్టాలపై ఉండగానే రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను ప్రారంభించాడు. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగిపోయింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి తాజాగా బుల్ బుల్ తరంగ్ అంటూ సాగే ఓ సాప్ట్ మెలోడీని విడుదల చేశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఈ పాటను యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సాంగ్‌కు రాకెందు మౌళీ లిరిక్స్ ఇచ్చారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటలో రవితేజతో పాటు రజీషా విజయన్ కనిపించింది. ఇక, ఈ సాంగ్ కంపోజింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. రవితేజ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లుగా ఇది అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దీంతో దీనికి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా స్పందన వచ్చి వైరల్ అయిపోయింది.

ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది జూన్ 17 విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X