ఏ హీరోకు దక్కని ఫీట్.. బన్నీకి మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్
Recommended Video
అల వైకుంఠపురములో సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాను షేక్ చేస్తే.. విడుదలయ్యాక బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. అయితే అల వైకుంఠపురములో యూట్యూబ్‌లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వంద మిలియన్ల సాంగ్స్‌ను అందించిన ఆల్బమ్‌గా అల వైకుంఠపురములో, హీరోగా బన్నీ, సంగీత దర్శకుడిగా తమన్ ఇలా రికార్డులు నమోదయ్యాయి.

అన్నీ సెన్సేషనల్ సాంగ్స్..
సామజవరగమన నుంచి మొదలు పెడితే.. రాములో రాములో, ఓ మై గాడ్ డాడీ, బుట్టబొమ్మ, అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి సన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. యూట్యూబ్‌కు నిద్ర పట్టకుండా చేస్తోన్న ఈ పాటలు తెలుగు నాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. వంద మిలియన్ల పాట తెలుగు సినీ చరిత్రలో వస్తుందా? అని అనుకుంటూ ఉంటే.. ఏకంగా రెండు వంద మిలియన్ల పాటలు ఒకే ఆల్బమ్ నుంచి రావడం విశేషం.

మొదటి వంద మిలియన్ల సాంగ్..
టాలీవుడ్ నుంచి మొదటి వంద మిలియన్ల సాంగ్‌గా సామజవరగమన రికార్డు సృష్టించగా.. వన్ మిలియన్ లైక్స్ సాధించిన పాటగా కూడా రికార్డు నమోదు చేసింది. నేటి వరకు ఈ పాటను 140మిలియన్ల మంది వీక్షించగా.. 1.2మిలియన్ల లైకులో ఇంకా దూసుకుపోతోంది.

తాజాగా రాములో రాముల..
సామజవరగమన పాట కంటే వెనక వచ్చి.. ఆ పాటను బీట్ చేసింది రాములో రాముల పాట. ఏ పార్టీలో చూసినా రాములో రాముల పాటకు మోగాల్సిందే.. బన్నీ స్టైల్ స్టెప్పులు వేయాల్సిందే. ఈ పాట కూడా వంద మిలియన్లను క్రాస్ చేసేసి.. తాజాగా వన్ మిలియన్ లైకులను సొంతం చేసుకుంది.

అరుదైన ఫీట్..
ఒకే సినిమాలో రెండు పాటలు వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించడం ఒకెత్తు అయితే.. ఆ రెండూ కూడా వన్ మిలియన్ లైకులను సొంతం చేసుకోవడం అరుదైన ఫీట్. సౌత్‌లోంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచాడు. అటు ఈ రికార్డులు పరుగులు పెడుతూ ఉంటే.. ఇటు బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతున్నాయి. అల వైకుంఠపురములో ఐదు రోజుల్లో... మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 96కోట్ల షేర్, 134కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని టాక్.


Click it and Unblock the Notifications











