Brahmastra: ఓం దేవ దేవ వీడియో సాంగ్.. రణ్‌బీర్‌ విజువల్ ట్రీట్.. ఆలియా స్పెషల్ ఎంట్రీ!

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ గ్లామరస్ హీరోయిన్ అలియాభట్ జంటగా నటించిన మరో సినిమా బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయనే చెప్పాలి. ఇక సినిమాలో విజువల్ ట్రీట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాల స్థాయిని పెంచాయి.

ఇక ఇప్పుడు వీడియో సాంగ్స్ తో కూడా అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సాంగ్ విడుదల చేశారు. దేవా దేవా అనే ఆ పాట వినడానికే కాకుండా చూడడానికి కూడా అద్భుతంగా ఉంది రణ్‌బీర్‌ కపూర్ విజువల్ ట్రీట్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆలియా భట్ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా మొదట్లో రణ్‌బీర్‌ కపూర్ గురువుగా కనిపించారు.

Ranbir kapoor brahmastra movie deva deva video song released

గురూజీ ఈ అస్త్రాలతో నా జీవితం ఎందుకు ముడిపడి ఉంది అని అడిగినప్పుడు ఎందుకంటే నువ్వు కూడా ఒక అస్త్రానివి.. బ్రహ్మాస్త్రానివి అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో.. రణ్‌బీర్‌ కపూర్ చేతిలో నుంచి వచ్చిన అగ్నిజ్వాలలు ఎంతో విజువల్ ట్రీట్ ను అందిస్తున్నాయి. కంప్లీట్ గ్రాఫిక్స్ తో కొన్ని సన్నివేశాలు సినిమా మొత్తంలో హైలైట్ గా నిలవబోతున్నట్లు ముందుగానే చెప్పేస్తున్నారు.

ఇక ఈ సాంగ్ కూడా ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రీతం సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ తెలుగులో రచనను అనువదించారు. ఇక తెలుగు సింగర్ శ్రీరామచంద్ర ఈ పాటను పాడడం విశేషం. అలాగే జోనిత గాంధీ అర్జిత్ సింగ్ కూడా ఈ పాటలో వారి గొంతును కలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X