రెండో బిడ్డకు తల్లికాబోతున్న హాలీవుడ్ స్టార్.. నగ్నంగా మారి గర్బాన్ని చూపిస్తూ షోటోషూట్!
అమెరికాలో పాపులర్ ర్యాపర్ కార్డీ బీ మరోసారి అభిమానులకు, సంగీత ప్రియులకు షాకిచ్చింది. తాను రెండోసారి గర్బం దాల్చినట్టు చెప్పడం కాకుండా తన గర్బాన్ని ప్రదర్శిస్తూ మీడియాకు ఫోజిచ్చింది. దాంతో సంగీత ప్రముఖులు, మ్యూజిక్ సెలబ్రీటలు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ సందేశాలు పంపిస్తున్నారు. ఆ విషయంలోకి వెళితే..

రెండోసారి గర్బవతిని అంటూ
అమెరికాలో జూన్ 27వ తేదీన నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో కార్డీ బీ అభిమానులను తన ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. మిగోస్‌తో కలిసి BET అవార్డుల ఫంక్షన్‌లో తన ర్యాపింగ్ ప్రతిభతో ఆలరించారు. ప్రదర్శన అనంతరం తన కడుపును చూపిస్తూ తాను రెండోసారి గర్బవతిని అవుతున్నానంటూ ప్రకటించారు.

నగ్నంగా గర్బాన్ని ప్రదర్శిస్తూ
BET అవార్డుల ప్రదర్శన పూర్తి కాగానే న్యూడ్ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో కార్డ్ బీ షేర్ చేసింది. రెండో సంతానం కోసం మానసికంగా సిద్ధమవుతూ.. చేసిన మెటర్నిటీ ఫోటోషూట్‌లోని ఓ ఫోటోను షేర్ చేసింది. తన గర్భాన్ని ప్రదర్శిస్తూ మాతృత్వాన్ని అనుభూతిని పొందుతున్నట్టు తన పోస్టులో పేర్కొన్నారు.
సెలీనా, కర్దాషియాన్ అభినందనలు
కార్డీ బీ ఇన్స్‌టాగ్రామ్‌లో తన ప్రెగ్నెన్సీ ఫోటోను పోస్టు చేయగానే సెలబ్రిటీలు, అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. డీజే ఖాలీద్, ఖోల్ కర్దాషియాన్ లాంటి వాళ్లు కంగ్రాట్స్ మెసేజ్‌తో శుభాకాంక్షలు తెలిపారు. నీ గర్భం నుంచి మరో చిన్నారి దేవత.. లవ్ యూ మమ్మా అంటూ సెలీనా గోమేజ్ ట్వీట్ చేశారు.

ఆనందంలో కార్డీ బీ భర్త ఆఫ్‌సెట్
తన ప్రెగ్నెన్సీని కార్డీ బీ కన్ఫర్మ్ చేయగానే తన భర్త ఆఫ్‌సెట్ కూడా తన సంతోషాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో వ్యక్తం చేశాడు. చిన్నారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. భార్య కార్డీ బీతో దిగిన ఫోటోను ఆఫ్‌సెట్ కూడా షేర్ చేశారు. #2 అంటూ రెండో బిడ్డకు స్వాగత పలికారు. కార్డ్ బీ, ఆఫ్‌సెట్ వివాహం 2017లో జరిగింది. గతంలో ఓ బిడ్డకు ఈ దంపతులు జన్మనిచ్చారు.

కార్డీ బీ కెరీర్ ఇలా..
మహిళా హిప్‌హాప్ ఆర్టిస్టుగా కార్డీ బీ ఐదుసార్లు బెస్ట్ ఫీమేల్ ఆర్టిసుగా నామినేట్ అయ్యారు. మీగన్థీ స్టాలియన్‌తో కలిసి చేసిన వ్యాప్ ఆల్బమ్‌కు మంచి ఆదరణ దక్కింది. 2015లో తన పాటలతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టరాు. లవ్ అండ్ హిప్ హాప్: న్యూయార్క్, కాక్‌టెయిల్స్ విత్ కోలే, హిప్ హాప్ స్వేర్స్, రిథమ్ + ఫ్లో చిత్రాలకు పనిచేశారు. త్వరలోనే ఎఫ్9తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











