రష్మీ అంతకు మించి హాట్‌ హాట్‌గా .. ఆమె గురించే అంతా మాట్లాడుతారు..

By Rajababu

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం "అంతకు మించి". జై ,రష్మీ గౌతమ్ జంటగా జానీ డైరెక్టర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లిరికల్ సాంగ్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జానీ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ తర్వాత యాంకర్ రష్మి గౌతమ్ నటన గురించే అందరూ మాట్లాడుకొంటారు అని అన్నారు.

రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో రష్మి నటించింది. ఎవరైనా కొత్త హీరో ఫైట్స్, డాన్సులు ఉండాలని కోరుకొంటారు. కానీ హీరో జై మాత్రం పెర్ఫామెన్స్ ఉన్న పాత్రను డిజైన్ చేయమని అడిగాడు. పాత్ర కోసం చాలా కష్టపడి పడ్డారు. అంతకు మించి ఓ సైలెన్స్ హారర్ చిత్రం. ఈ సినిమాకు తగినట్టే మ్యూజిక్‌ను, రీరికార్డింగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అందించాడు. అంతకు మంచి సినిమా ప్రారంభమైన 20 నిమిషాల వరకు ఒక్క డైలాగ్ కూడ ఉండకపోవడం విశేషం. ఈ నెల 24న రిలీజ్‌కు సినిమా సిద్దమవుతున్నది అని జానీ అన్నారు.

Rashmi Gautams Anthaku Minchi’ lyrical Song released

హీరో జై మాట్లాడుతూ.. నైజాంలో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 100 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు రష్మీ ప్రధాన ఆకర్షణ. పక్కా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాము అని అన్నారు.

రష్మీ మాట్లాడుతూ... ట్రెండీగా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. సినిమా కేక్ అయితే ఈ రోజు విడుదల చేసిన టైటిల్ లిరికల్ సాంగ్ క్రీమ్ అని చెప్పొచ్చు. ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు అందరూ. అందరికీ అంతకు మించి సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో రైటర్ మోహన్, పురుషోత్తం (సౌండ్ ఎఫెక్ట్స్), నటులు రింగ్ మణి, రాజ్ పాల్, హర్ష, ప్రసాద్, కర్ణ(ఎడిటర్), వంశీ తదితరులు పాల్గొన్నారు.

Rashmi Gautams Anthaku Minchi’ lyrical Song released

నటీనటులు, సాంకేతిక వర్గం
జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి‌ఎన్‌ఆర్, మధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి(ఆర్ కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుధీర్ కుమార్, ఫైట్స్ (రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ. మధుసూధన్‌రెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం, నిర్మాత: సతీష్, ఎ. పద్బనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X