Rashmika Mandanna: యానిమల్‌లో రష్మిక పాత్ర లీక్.. లిప్‌లాక్స్‌తో హడలెత్తించే ఆ పాత్రలో నేషనల్ క్రష్!
Rashmika Mandanna: తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న యానిమల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రానే వచ్చేసింది. అమ్మాయి అంటూ సాగే ఈ పాటను ఈరోజు అన్ని భాషల్లో విడుదల చేశారు. సాధారణంగా లిరికల్ సాంగ్స్ విడుదల చేయడం అందరికీ తెలిసిందే. కానీ యానిమల్ చిత్రబృందం మాత్రం పూర్తి స్థాయి వీడియో సాంగ్ ను విడుదల చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. కేవలం పాటే కాదండోయ్.. ఈ సినిమాలో రష్మిక మందన్నా క్యారెక్టర్ ను కూడా లీక్ చేసేశారు.
యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా, రణబీర్ కపూర్ హీరోహీరోయిన్లుగా కనిపిచంబోతున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా ఆయన ప్రత్యేక మార్క్ ను చూపించారు. ఫుల్లు రొమాన్స్ తో సినిమాను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక పాత్రను మాత్రం చాలా అద్భుతంగా తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో అచ్చమైన తెలుగు అమ్మాయిలో రష్మిక అదరగొట్టబోతుంది. ఫస్ట్ వీడియో సాంగ్ వీడియో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఈ వీడియో మొత్తం చాలా లిప్ లకా సీన్లు ఉన్నాయి. రష్మిక మందన్నా, రణబీర్ కపూర్ల రొమాన్స్ చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమానే గుర్తుకు వస్తోంది. ముఖ్యంగా ఘాటు లిప్ లాక్స్ సీన్లతో పాటు మ్యూజిక్, లిరిక్స్, విజ్యువల్స్ అన్నీ హై రేంజ్ లోనే ఉన్నాయి. నింగి, నేల నీలా నాలా అంటూ ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ వీడియో సాంగ్ లో మూడు సార్లు ఘాటుగా లిప్ లాక్ చేసుకోవడం చూడవచ్చు. ముందుగా రణబీర్ కపూర్ ను తీసుకొచ్చి రష్మిక తన ఇంట్లో వాళ్లకు తన ప్రేమ విషయాన్ని చెబుతుంది. కానీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులందరి ముందే వారిద్దరూ లిప్ లాక్ చేసుకోవడంతో పాట మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లైట్ లో కిస్ చేసుకుంటారు. ఫుల్లుగా రొమాన్స్ చేసుకొని.. ఆపై మంచుకొండపై ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉన్న గుడికి వెళ్తారు.

అక్కడే రణబీర్ కపూర్.. రష్మిక మందన్నాకు బొట్టు పెట్టి తాళి కడతాడు. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ అద్భుతమైన పాట అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ వైరల్ గా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. భద్రకాళి ఫిలిమ్స్, టీ సిరీస్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











