‘ఖిలాడీ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: రవితేజ జాతర పండుగ రోజు నుంచేనట

బ్యాంగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతోన్న వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరీ ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలను చేస్తూ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిగిరి చూడని ఈ సీనియర్ హీరో.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తూనే ఉన్నాడు.

'రాజా ది గ్రేట్' తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు మాస్ మహారాజా రవితేజ. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ స్టార్ హీరో వెంటనే 'ఖిలాడీ' అనే సినిమా మొదలెట్టాడు.

Ravi Teja Khiladi Movie First Single on September 10th

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రమే 'ఖిలాడీ'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

ఈరోజు (ఆగస్టు 22) 'ఖిలాడీ' మూవీ డైరెక్టర్ రమేష్ వర్మ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఇందులోని మొదటి పాటను వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో మాస్ మహారాజా రవితేజ బ్యాక్ నుంచి ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో దర్శకుడు రమేష్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీని కోసం దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే పాటను రెడీ చేశాడని తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X