Khiladi Istam Song: అదరగొట్టిన డీఎస్పీ.. ఆకట్టుకుంటోన్న ‘ఖిలాడీ’ సాంగ్

చాలా కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న తరుణంలో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఇది భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ ఊహించని రీతిలో వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్‌తో ఉన్న రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

భారీ స్థాయిలో రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా బ్యాలెన్స్ పార్ట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను అందించింది చిత్ర యూనిట్.

Ravi Teja Khiladi Movie Istam Lyrical Song Released

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితమే 'ఖిలాడీ' మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'నువ్వంటే ఇష్టం' అంటూ సాగే ఈ సాంగ్‌ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. దీనికి శ్రీమణి లిరిక్స్ రాయగా.. హరిప్రియ ఆలపించింది. మెలోడీ జోనర్‌లో వచ్చిన ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా దీన్ని కంపోజ్ చేసిన విధానం, పాడిన స్టైల్, రచయిత రాసిన పదాలు అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు, ఈ సాంగ్ పాత డీఎస్పీని గుర్తు చేసే విధంగా ఉంది. దీంతో ఈ సాంగ్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది.

రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ' మూవీ పట్టాలపై ఉండగానే.. శరత్ మందవ అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది కూడా చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇందులో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X