Naa Peru Seesa: రవితేజ సినిమా నుంచి స్పైసీ ట్రీట్.. ఈ మధ్యలో చూడని విధంగా!

ఆ మధ్య కాలంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆరంభంలో 'క్రాక్' వంటి భారీ హిట్‌ను అందుకుని మళ్లీ ట్రాకులోకి వచ్చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదే రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ మూవీ రికార్డులకెక్కింది. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు భారీ షాకిచ్చారు. దీంతో ఈ చిత్రం ఎక్కువ నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలింది.

చాలా రోజుల క్రితమే మాస్ మహారాజా రవితేజ.. 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా అవాంతరాల నడుమ ఇటీవలే పూర్తైంది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. దీంతో ఈ సినిమా నిత్యం వార్తల్లోనే ఉంటూ బజ్‌ను విపరీతంగా పెంచుకుంటోంది. ఫలితంగా ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Ravi Teja Ramarao On Duty Naa Peru Seesa Song Released

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని రవితేజ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావించాడు. కానీ, అనుకోని ఆంటకాల వల్ల దీనికి చాలా బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ దీన్ని ఈ స్టార్ హీరో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని గతంలో చెప్పిన డేట్‌కు కాకుండా జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీనికి ఎంతో సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని అప్‌డేట్లను కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు.

'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ నుంచి తాజాగా అదిరిపోయే స్పెషల్ సాంగ్ విడుదలైంది. 'నా పేరు సీసా' అంటూ సాగే ఈ పాటను సామ్ సీహెచ్ స్వరపరచగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అలాగే, ఈ పాటను శ్రేయా గోషల్ అదిరిపోయేలా ఆలపించారు. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ స్టూడియోలో ఈ పాటకు సంబంధించిన షూట్ జరిపారు. ఇక, ఇందులో సంచలన వెబ్ సిరీస్ 'గంధీ బాత్' ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న అన్వేషి జైన్ డ్యాన్స్ చేసింది. ఇందులో ఆమె వేసిన స్పైసీ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో చూడనంత హాట్‌గా ఈ పాట ఉంది. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయిపోయింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X