రవితేజ అభిమానుల కోసం బర్త్‌డే గిఫ్ట్: ఫుల్ కిక్ అంటూ రచ్చ చేయనున్న మాస్ హీరో

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. అప్పుడప్పుడు భారీ సక్సెస్‌లను కూడా అందుకున్నాడు. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక, గత ఏడాది ఆరంభంలో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు రవితేజ. దీంతో రెట్టించిన జోష్‌తో ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ తెగ సందడి చేస్తున్నాడు.

'క్రాక్' వచ్చిన వెంటనే మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. అయితే, సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌ ఆగిపోయింది. దీంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేసేశాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు.

Ravi Tejas Khiladi Movie Full Kick Lyrical Song on January 26th

రవితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' మూవీని ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుసగా అప్‌డేట్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కొద్ది రోజుల క్రితమే 'ఖిలాడీ' మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'నువ్వంటే ఇష్టం' అంటూ సాగే ఈ సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను కూడా వదిలారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'అట్టసూడకే' అంటూ సాగే పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి సైతం మంచి స్పందనే వచ్చింది.

జనవరి 26న మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'ఖిలాడీ' మూవీ నుంచి 'ఫుల్ కిక్' అంటూ సాగే ఓ పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో కొంత మంది ఆడవాళ్లు చీరలు కట్టుకుని ఉన్న బ్యాగ్రౌండ్ కనిపించింది. దీంతో ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఇక, ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. అతడి తమ్ముడు సాగర్ ఆలపించాడు. దీనికి శ్రీమణి లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాట కోసం రవితేజ ఫ్యాన్స్ యమ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X