థమన్ - అనిరుధ్ కాంబోలో ‘క్రాక్’ సాంగ్: అదరగొడుతోన్న రవితేజ మాస్ బీట్
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. 'డాన్ శీను', 'బలుపు' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో జట్టుకట్టాడు. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'క్రాక్' అనే సినిమా రూపొందుతోంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాలోని రెండో పాట టీజర్ విడుదలైంది. 'భలేగా తగిలావే బంగారం' అంటూ సాగే ఈ సాంగ్‌కు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, మరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రామచ్రందన్ ఓకల్స్ అందించాడు. మాంచి మాస్ బీట్‌తో సాగే ఈ పాట సినిమాకు ప్లస్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 30 సెకెన్లు మాత్రమే ఉన్న ఈ సాంగ్ టీజర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. ఇక, ఈ పాట సోమవారం విడుదల కానుంది. దీంతో మాస్ మహారాజ అభిమానులు దీని గురించి వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ గోవాలో జరిగిన చివరి షెడ్యూల్ రెండు పాటలు సహా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించింది. ఈ చిత్రం యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగనుందని తెలుస్తోంది. అలాగే, ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఇది రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











