‘క్రాక్’ నుంచి కోరమీసం పోలీసోడా సాంగ్ రిలీజ్: అదిరిపోయిన రవితేజ - శృతి హాసన్ కెమిస్ట్రీ
మాస్ మహారాజ రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'క్రాక్'. 'డాన్ శీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. శృతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ నుంచి కానుకగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.
తాజాగా 'క్రాక్' సినిమా నుంచి 'కోరమీసం పోలీసోడా' అంటూ సాంగ్ ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఆ పాట ఆకట్టుకుంటోంది. స్లోగా సాగుతూ రొమాంటిక్ ఫీల్‌ను పంచుతోంది. ఇందులో భర్తను ఖాకీ డ్రెస్ తన నుంచి దూరం చేస్తుందన్న కోపంతో హీరోయిన్ పాడే ఈ పాట డీసెంట్ మెలొడీ అనిపించుకుంది. అలాగే, ఈ పాటలో రవితేజ - శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. దీనికి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాయగా, ప్రముఖ సింగర్ రమ్య బెహ్రా అద్భుతంగా ఆలపించింది.

ఇక, ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'భలేగా తగిలావే బంగారం' అంటూ సాగే పాట విడుదలైంది. మాంచి మాస్ బీట్‌తో సాగే ఈ పాట అదరగొట్టేసింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే కార్యక్రమంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











