మరో ప్రయోగానికి సిద్ధమైన రవితేజ: కెరీర్‌లో ఐదోసారి ఆ పని చేయబోతున్న మాస్ హీరో

కొంత కాలంగా ఫ్లాపుల మీద ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో.. గత సంక్రాంతికి విడుదల అయిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ ఊహించని రీతిలో వసూలు చేసింది. దీంతో ఈ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ ఫిల్మ్ రిజల్ట్ ఇచ్చిన జోష్‌తో ఉన్న రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా బ్యాలెన్స్ పార్ట్‌ను షూట్ చేశారు. ఇలా ఈ సినిమా టాకీ పార్ట్‌ను దాదాపుగా పూర్తి చేసేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Ravi Teja turns singer for Khiladi Movie

తాజాగా 'ఖిలాడీ' మూవీ గురించి ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం మాస్ మహారాజా రవితేజ మరోసారి గొంతును సవరించబోతున్నాడు. అదేనండీ.. ఈ మూవీలో అతడు ఓ పాటను పాడబోతున్నాడట. ఇందుకోసం దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్‌ను కంపోజ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇది ఈ రెండు మూడు రోజుల్లోనే రికార్డ్ చేయబోతున్నారని తెలుస్తోంది. గతంలో రవితేజ 'బలుపు', 'పవర్', 'రాజా ది గ్రేట్', 'డిస్కో రాజా' వంటి చిత్రాల్లో పాటలు పాడాడు. ఇప్పుడు మరోసారి ఆ ప్రయోగం చేయడానికి సిద్ధం అయ్యాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ' మూవీ పట్టాలపై ఉండగానే.. శరత్ మందవ అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది కూడా చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీనితో పాటు ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినతో 'ధమాకా' అనే సినిమాను కూడా ప్రారంభించాడు. ఇవి మాత్రమే కాదు.. సుదీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే ప్రాజెక్టును సైతం ప్రకటించాడు. వీటితో పాటు 'టైగర్' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X