South Side Story Season 5 షోకు విశేష ఆదరణ.. Red FM మ్యూజికల్ ఈవెంట్‌కు పొటెత్తిన అభిమానులు!

భారతీయ వినోదరంగంలో 93.5 రెడ్ ఎఫ్ఎం అంటే తెలియని వారుండరు. వారి కార్యక్రమాలను శ్రోతలను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గత కొన్నేళ్లుగా శ్రోతలను ఆకట్టుకొంటున్న రెడ్ ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్ వర్క్ తాజాగా సౌత్ సైడ్ స్టోరి సీజన్ 5 ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రదర్శించగా అనూహ్యమైన స్పందన లభించింది. సెప్టెంబర్ 5వ తేదీన ముంబైలోని బైకూలా రిచర్డ్‌సన్ అండ్ కుడ్డాస్‌ ప్రాంతంలో, అలాగే ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రేక్షకుల ఆదరణ లభించింది. మ్యూజికల్ లవర్స్‌కు అమూల్యమైన అనుభూతిని పంచింది.

సౌత్ సౌడ్ స్టోరి సీజన్ 5 (South Side Story Season 5) సంగీత కార్యక్రమంలో ఆట్టమ్ కళాసమితి ఎఫ్‌టీ ది తీక్కిన్‌కాడు బ్యాండ్, మాళవిక సుందర్, సీన్ రోల్డాన్ అండ్ ఫ్రెండ్స్, అరివు ఆగమ్, థైక్కుడమ్ బ్రిడ్జ్, నీరజ్ మాధవ్, హనుమాన్ కౌండ్, సితారా ప్రాజెక్ట్ మలబారికస్, ఆల్ ఒకే, తిరుమలి బ్యాన్స్ ప్రదర్శించిన కార్యక్రమాలు, వారి పెర్ఫార్మెన్స్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఢిల్లీలో, ముంబైలోని సంధ్యలో రుచికరమైన దక్షిణాదికి చెందిన రుచికరమైన భోజనాలు, ఫుడ్‌ను అందించారు.

Red FMs South Side Story Season 5 get huge response from Delhi, Mumbai music lovers

సౌత్ సౌడ్ స్టోరి సీజన్ 5 (South Side Story Season 5) సంగీత కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో రెడ్ ఎఫ్ఎమ్, మ్యాజిక్ ఎఫ్ఎమ్ సంస్థ డైరెక్టర్, సీవోవో నిషా నారాయణన్ మాట్లాడుతూ.. ప్రాంతీయంగా ఉండే సంగీతాన్ని సౌత్ సైడ్ స్టోరి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అందించాలన్నదే మా విజన్.

Red FMs South Side Story Season 5 get huge response from Delhi, Mumbai music lovers

ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లోని సంగీత ప్రియులకు రీజినల్ మ్యూజిక్‌ను అందించాలనే ప్రయత్నానికి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. వర్షాలను సైతం లెక్క చేయకుండా సంగీత ప్రియులు వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దక్షిణాదిలో ఉండే సంప్రదాయ వస్త్రధారణ, ఇతర అంశాలతో కూడిన కార్యక్రమంలో భాగమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X