twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రెడ్’ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్: లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన హీరో రామ్

    |

    ఎనర్జిటిక్ యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో హీరోగా రాణిస్తున్నాడు రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిన అతడు.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీ కోసం అతడు పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. అంతేకాదు, విమర్శలకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రం 'రెడ్'.

    'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాల తర్వాత కిశోర్ తిరుమల - రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'రెడ్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్ సహా కొన్ని పాటలను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

    RED Nuvve Nuvve Video Song Released: Ram Malvika Sharma Liplock

    తాజాగా 'రెడ్' మూవీ నుంచి 'నువ్వే నువ్వే' అంటూ సాగే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీని చూపించారు. అంతేకాదు, ఈ పాట చివర్లో లిప్‌లాక్ సీన్ కూడా చూపించారు. విజువల్‌గా ఎంతో ఆకట్టుకుంటోన్న దీనికి మణిశర్మ అందించిన మ్యూజిక్ మాంచి ఫీల్‌ను కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో హీరోయిన్లు నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు కూడా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

    English summary
    Ram Pothineni is an Indian film actor who is known for his works in Telugu cinema. He is a nephew of the film producer Sravanthi Ravi Kishore. Pothineni made his film debut in 2006 with the masala flick Devadasu, which became a blockbuster at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X