రెడ్డీ ఇక్కడ సూడు సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో అదరగొడుతున్న ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు అరవింద సమేత మానియాతో ఊగిపోతున్నారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇది. టీజర్, ట్రైలర్ అదరగొట్టడంతో సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.
ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలోని మాస్ నంబర్ రెడ్డీ ఇక్కడ సూడు సాంగ్ ప్రోమో విడుదల చేశారు. అనుకున్న విధంగానే ఎన్టీఆర్ డాన్స్ తో అదరగొడుతున్నాడు. ఈ సాంగ్ ని త్రివిక్రమ్ కలర్ ఫుల్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ పూజ హెగ్డే అందాలు ఒలకబోస్తోంది.

సినిమాపై పూర్తి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని టాక్. తమన్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











