Gaana Of Republic: పాట ఎలా పుడుతుందంటే.. ఫన్నీగా వీడియో వదిలిన దేవకట్టా టీమ్
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన దేవకట్టా అంటే అగ్ర దర్శకులకు కూడా చాలా రెస్పెక్ట్. ఆయన తీసిన ప్రస్థానం సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్కవ్వకపోయినా కూడా ఆ సినిమాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి, వినాయక్ వంటి వారు కూడా దేవకట్టాకు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఈ దర్శకుడు ఎంతగా ప్రశంసలు అందుకున్నా కూడా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు.
మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చాలా ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు రిపబ్లిక్ సినిమాను లైన్ లో పెట్టాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక మంచి సోషల్ మెస్సేజ్ ఉంటుందట. ఇక సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ తోనే మంచి బజ్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక సినిమా సాంగ్ ఎలా మొదలైంది మణిశర్మ ఇక కంపోజ్ చేశాడు అనే విషయాలని సరదాగా చూపించారు.

ఇక సినిమాలో రాజకీయ నాయకులకు అలాగే ఓటు హక్కు వినియోగించుకునే యువతకు కూడా కౌంటర్ ఇచ్చేలా మంచి సందేశం ఉంటుందని సమాచారం. దర్శకుడు దేవకట్టా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాగే సాయి సాయి ధరమ్ తేజ్ నటన కూడా సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో హీరోకు మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











