twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పుష్ప’ మూవీ టీమ్‌లోకి ఆస్కార్ అవార్డు గ్రహీత: వెల్‌కం పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో యూనివర్శల్ కాన్సెప్టు వస్తోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ఎంతో మంది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో మరొకరు భాగమయ్యారు.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలోకి ప్రముఖ సౌండ్ ఇంజనీర్, ఆస్కార్ పురస్కార గ్రహీత రసూల్ పూకుట్టి కూడా చేరినట్లు తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాణ సంస్థ.. అతడికి స్వాగతం చెబుతున్నట్లు అందులో పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అడవుల్లోనే జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఇందులో బ్యాగ్రౌండ్‌లో వచ్చే సౌండ్‌కు ప్రత్యేకమైన క్వాలిటీ ఉన్న ఇంజనీర్ కావాల్సి వచ్చిందట. అందుకే రసూల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి రాకతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పొచ్చు.

    అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

    Resul Pookutty Joins Allu Arjuns Pushpa Unit

    ఇక, 'పుష్ప' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇటీవలే విడుదలై ఈ మూవీ ప్రిల్యూడ్ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఇక, ఈరోజు సాయంత్రం పుష్పరాజ్ పరిచయ వీడియో కూడా విడుదల కానుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజ్ కానుంది.

    English summary
    Pushpa is an upcoming Indian Telugu-language action thriller film written and directed by Sukumar with Allu Arjun, Vijay Sethupathi, Rashmika Mandanna, Prakash Raj and Jagapati Babu in lead roles, while Harish Uthaman, Vennela Kishore and Anasuya Bharadwaj in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X