Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒక్కపాటలో ఎన్ని విషయాలో.. ‘గడ్డి తింటావా’లో పవర్ స్టార్‌తో పాటు ఆ ముగ్గురిని టార్గెట్ చేసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాపై బాగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి, పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న హీరోను పరిచయం చేసిన దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే వర్కింగ్ స్టిల్స్లోనూ ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైప్ తెచ్చాడు. పవర్ స్టార్ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో వర్మ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది.
వర్కింగి స్టిల్స్..
వర్మ పవర్ స్టార్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచడం ప్రారంభించాడు. ఫాంహౌస్, చంద్రబాబు, చిరంజీవి, త్రివిక్రమ్ వంటి వారందరినీ కలుపుతూ వర్మ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ట్రైలర్కూ రేటు..
ప్రపంచ సినీ చరిత్రలో ట్రైలర్ వీక్షించడానికి టికెట్ పెట్టిన మహానుభావుడిగా వర్మ రికార్డులు సృష్టించాడు. జూలై 22న విడుదల కానున్న ట్రైలర్‌ను వీక్షించాలంటే 25 రూపాయలు చెల్లించాలని తెలిపాడు. ఇలా ప్రతీదాంట్లో వర్మ తనదైన ముద్రను చూపిస్తున్నాడు. గడ్డితింటావా అనే పాటను తాజాగా రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
గడ్డితింటావా..?
గడ్డితింటావా
అంటూ
ఫాంహౌస్‌లో
పవర్
స్టార్
సినిమాలోని
హీరో
పాడుకోవడం
చూపించాడు.
అందులో
భాగంగా
పవర్
స్టార్
తన
జీవితాన్ని
మొత్తం
గుర్తుకు
చేసుకుంటూ
ఫాంహౌస్‌లో
పశువులు,
చెట్లు,
పుట్టలకు
తన
గాథను
చెప్పుకొంటున్నాడు.
ముఖ్యంగా
పాటలోని
లిరిక్స్
మరీ
సెటైరికల్‌గా
ఉన్నాయి.
|
ఒక్క పాటలో అందర్నీ..
గడ్డి తింటావా అనే ఒక్క పాటలోనే అంతా చూపించాడు వర్మ. దేవుడంటూ ఒకడు కొలిచాడని, నెత్తిన ఒకడు పెట్టాడని, పవర్ స్టార్ అంటూ కొందరు అరిచారని, తీరా పవర్ అడిగితే స్టార్స్ చూపించారని, అంతా మోసం చేశారని గేదెలు, చెట్లకు తన బాధను చెప్పుకొంటున్న ఈ పాటలో గొంతు వినడానికి మరీ కర్ణకఠోరంగా ఉన్నా లిరిక్స్ బాగానే ఉన్నాయి.