సింగర్ మంగ్లీ పార్టీపై పోలీసుల దాడి.. పలువురికి డ్రగ్స్ పరీక్షలు.. నిర్మాత అరెస్ట్

ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీపై హైదరాబాద్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డ్రగ్స్, రేవ్ పార్టీ జరుగుతున్నదా? అనే అనుమానాల నేపథ్యంలో జరిపిన ఈ రైడ్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తేలింది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. పోలీసుల ఈ మెరుపుదాడికి సంబంధించిన పూర్తి వార్త వివరాల్లోకి వెళితే..

సింగర్ మంగ్లీ తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులకు పార్టీని అరెంజ్ చేసింది. ఈ పార్టీని చేవెళ్లలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో నిర్వహించారు. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారనే సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకొన్నారు.

Ride on Singer Mangli Birthday Party

చేవెళ్ల రిసార్టులోకి పోలీసులు ప్రవేశించగానే ప్రముఖులు, సింగర్ మంగ్లీ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ పార్టీలో దివి వద్యా, కాసర్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఓ నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గోన్నారు. వారిలో 9 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మంగ్లీ, నిర్వహించిన రిసార్టుపై కేసు నమోదు చేశారు అని తెలిసింది.

సింగర్ నిర్వహించిన పార్టీలో పలువురు గంజాయి, తదితర మత్తు పదార్థాలు వాడినట్టు సమాచారం. అయితే నిషేధిత మాదక ద్రవ్యాలు ఈ పార్టీలో ఉపయోగించారా? ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన ఈ దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ దాడికి సంబంధించిన కథనాలు, ఆప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X