Anant Radhika Pre Wedding: ఆ సింగర్‌కు అంబానీ బంపర్ ఆఫర్.. ఒక్క పెర్ఫార్మెన్స్‌కే 50 కోట్లా!
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో ముకేష్ అంబానీ ఇంట జరుగుతోన్న వేడుకే అని తెలిసింది. ఈ అపర కుభేరుడి చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతోన్న ఈ వేడుక కోసం పాప్ సింగర్ రిహన్నా తన బృందంతో కలిసి వచ్చింది. ఇందులో ప్రదర్శన కోసం ఆమెకు అంబానీ ఎన్ని కోట్లు ఇస్తున్నారో పూర్తి వివరాలను మీరే చూసేయండి!
జూలైలో అనంత్ వివాహం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో పెళ్లి సందడి షురూ అయిపోయింది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో నిశ్చయం అయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ ఏడాది జులై 12న జరగనున్న వివాహ ఘట్టంతో ఒక్కటి కాబోతున్నారు.

ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్
అనంత్ అంబానీ వివాహం జూలైలో జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను అంబానీ ఫ్యామిలీ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసింది. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకూ అక్కడ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం అంబానీ కుటుంబం మూడు రోజుల ముందుగానే అక్కడకు చేరుకుని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంది.
ప్రముఖులకు ఆహ్వానం
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం ముకేష్ అంబానీ కుటుంబం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. ఈ మేరకు ఇప్పటికే ఈ వేడుక కోసం చాలా మంది సెలెబ్రిటీలు జామ్ నగర్‌కు చేరుకున్నారు. అందులో వ్యాపార, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు.
రిహన్నా ఎంతో స్పెషల్
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసమే ముకేష్ అంబానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వేడుక జరిగే మూడు రోజుల్లో చాలా మంది ప్రముఖులతో ప్రదర్శనలు ఇప్పించబోతున్నారు. అందులో పాప్ స్టార్ రిహన్నా కూడా ఉన్నారు. ఆమె ఇవ్వబోతున్న ప్రదర్శన ఈ ఈవెంట్‌లో ఎంతో స్పెషల్‌గా ఉండబోతుంది.
రిహన్నా ప్రదర్శన ఇలా
ముకేష్ అంబానీ ఫ్యామిలీ నిర్వహిస్తోన్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో రిహన్నా ప్రదర్శన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆమె ప్రదర్శన మార్చి 1వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కాబోతుందట. ఆమె టీమ్ నాన్ స్టాప్‌గా రెండు గంటల పాటు పలు పాటలను ఆలపించబోతుందని తెలిసింది.

ఏకంగా అన్ని కోట్ల చార్జ్
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కోసం వచ్చిన పాప్ స్టార్ రిహన్నా తన ప్రదర్శన కోసం ఏకంగా రూ. 50 కోట్లు చార్జ్ చేసిందని తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది. దీనితోపాటు ఆమె స్టే చేసే హోటల్, ఇతర ఖర్చులు కలిపి మరో రూ. 10 కోట్లు వరకూ ఉంటుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు అంబానీ ఈవెంట్‌లో రిహన్నా హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











