15 Years Of Anirudh: రాక్ స్టార్ అనిరుధ్ ఈవెంట్‌కు క్రేజీ డిమాండ్.. టికెట్స్ ఉన్న ఫ్యాన్స్‌కు ఇవే సూచనలు, సలహా

ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ భాగ్యనగర సంగీత అభిమానులను మరోసారి ఆలరించబోతున్నారు. తన మ్యూజిక్ కెరీర్‌ 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో XV Tour - 15 years with you అనే పేరుతో హైదరాబాద్‌లో గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో మ్యూజికల్ కాన్సెర్ట్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మార్చి 21వ తేదీన అట్టహాసంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో కనివినీ ఎరుగని విధంగా నిర్వహించనున్న ఈవెంట్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఈవెంట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలోనే కాకుండా భారతీయ సినీ సంగీత అభిమానులకు అనిరుధ్ మ్యూజిక్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆయన నిర్వహించే సంగీత కచేరీకి భారీ స్పందన లభించింది. దాదాపు 30 వేల సీట్ల కెపాసిటీ ఉన్న ఈవెంట్ కోసం 1.5 లక్షల మంది బుక్‌మై షో వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ చేయడం ఈవెంట్‌కు ఉన్న డిమాండ్ ఏమిటో తెలియకనే చెప్పింది. ఈ ప్రొగ్రాం కోసం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫ్యాన్ పింట్, గోల్డ్, సిల్వర్ జోన్స్‌గా విభజించిన కేటగిరిల టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడుపోవడం రికార్డుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రైబ్‌వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్, బుక్‌మై షో ఎంటర్‌ప్రైజెస్, ఓషియన్ వైబ్స్ సంస్థలు ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధిన మార్గదర్శకాలను ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు రిలీజ్ చేశాయి.

Rockstar Anirudh XV Tour in Hyderabad s Gachibowli Stadium

అనిరుధ్ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం మార్చి 21వ తేదీన గచ్చిబౌలి స్టేడియం గేట్లు సాయంత్రం 4.30 గంటల నుంచి తెరుచుకొంటాయి. స్టేజ్ ఓపెనింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు అని తెలిపారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే.. సిల్వ్, గోల్డ్ టికెట్స్ ఉన్న వారు బౌల్డర్ హిల్స్ పార్కింగ్‌లో వాహనాలను పార్క్ చేయాలి. కారు, బైక్ వాహనాలకు పార్కింగ్ అనుమతి ఉంటుంది. బౌల్డర్స్ హిల్స్‌లోనే బైక్స్ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి షటిల్ సర్వీస్‌ వసతి ఏర్పాటు చేయబడింది. మొదట ప్రవేశించిన వారికి మొదట ప్రయారిటీ (First come First Serve) ప్రకారం పార్కింగ్ విధానం ఉంటుంది.

ఫ్యాన్ పిట్ టికెట్లు ఉన్న వారు సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్‌లో వాహనాలు అంటే కార్లను మాత్రమే పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి బస్సు సదుపాయం ఉంటుంది. మొదట ప్రవేశించిన వారికి మొదట ప్రయారిటీ (First come First Serve) ప్రకారం పార్కింగ్ విధానం ఉంటుంది. ఇక గచ్చిబౌలి స్టేడియంలో రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్స్‌ మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసుకోవాలి. బస్ షెటిల్ సర్వీసులు 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. స్టేడియం గేటు వరకే టాక్సీ డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సాఫీగా కార్యక్రమం జరుగడానికి ప్రైవేట్ టాక్సీలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్ పూలింగ్ సదుపాయాలను వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదట ప్రవేశించిన వారికి మొదట ప్రయారిటీ (First come First Serve) ప్రకారం పార్కింగ్ విధానం ఉంటుంది. అని నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X