సౌత్ ఇండస్ట్రీలో మరో సంచలనాత్మక రికార్డు అందుకున్న రౌడి బేబి సాంగ్!
మారీ 2 సినిమా హిట్టు కాలేదు గాని అందులో పాటతో మాత్రం చిత్ర యూనిట్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు అందుకుంది. సాయి పల్లవి - ధనుష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన రౌడి బేబి సాంగ్ యూ ట్యూబ్ లో వరల్డ్ వైడ్ గా రికార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరొక న్యూ రికార్డ్ ను కూడా సొంతం చేసుకోగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది.
2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మరీ 2 సినిమాకు బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ డోస్ ఎక్కువవ్వడంతో అంచనాలకు తగ్గట్లుగా క్లిక్కవ్వలేదు. ఇక సినిమాకు అన్ని వర్గాల నుంచి క్రేజ్ దక్కించుకుంది అంటే అందుకు రౌడీ బేబి పాటనే కారణం. ఇప్పటికే ఇండియాలో బిలియన్ వ్యూవ్స్ మార్క్ ను టచ్ చేసిన టాప్ సాంగ్స్ లో ఒకటిగా రౌడి బేబి రికార్డు సృష్టించింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల మరో అరుధైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో అత్యదిక లైక్స్ అందుకున్న పాటగా కూడా రౌడి బేబి వీడియో సాంగ్ రికార్డును అందుకుంది. ఇటీవల 5 మిలియన్స్ లైక్స్ అందుకోగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాయి పల్లవి కెరీర్ లో కూడా ఇది మరోక రికార్డు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె ఖాతాలో అత్యదిక వ్యూవ్స్ అందుకున్న యూ ట్యూబ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. మరి రౌడి బేబి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











