twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ గుట్టు విప్పిన ఆర్పీ.పట్నాయక్.. రీసెంట్‌గా మళ్ళీ పెంచాడు అంటూ..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాకు ముందుగా భారీ హైప్ క్రియేట్ అవ్వాలి అంటే టీజర్ ట్రైలర్ కంటే ముందు సాంగ్స్ ఎక్కువగా క్లిక్కవ్వాలి అనే ఫార్ములా నడుస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకి ఒకే ఒక్క పాట ఆరో ప్రాణంలా మారుతోంది. ఇక సిద్ శ్రీరామ్ లాంటి గాయకుడు కూడా సినిమాలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాడు. అయితే అతను తీసుకునే రెమ్యునరేషన్ పై ఇటీవల సంగీత దర్శకుడు ఆర్పీ.పట్నాయక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

     సంగీత దర్శకులపై ఒత్తిడి

    సంగీత దర్శకులపై ఒత్తిడి

    సిద్ శ్రీరామ్ తో ఒక్క పాట పాడించినా కూడా చాలు అంటూ ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు సంగీత దర్శకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆ గాయకుడి కోసం స్పెషల్ గా ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో కొన్ని సినిమాలకు భారీగా హైప్ పెరగటానికి అతను ఎంతగానో ఉపయోగపడుతున్నాడు.

    ఒక్క పాటతో సినిమాకు ఫుల్ కలెక్షన్స్..

    ఒక్క పాటతో సినిమాకు ఫుల్ కలెక్షన్స్..

    'నీలి నీలి ఆకాశం' అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క పాటతోనే '30రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాకు నష్టాలు రాకుండా కలెక్షన్స్ వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకు ముందే గీతగోవిందం సాంగ్స్ కూడా భారీ స్థాయిలో హిట్టయ్యాయి.

    మొదటి సాంగ్.. ఏఆర్.రెహమాన్ ద్వారా

    మొదటి సాంగ్.. ఏఆర్.రెహమాన్ ద్వారా

    సినిమా సంగీత ప్రపంచంలోకి మొదట సిద్ శ్రీరామ్ ను ఏఆర్.రెహమాన్ తీసుకువచ్చారు. కడలి సినిమాలో 'యాడికే' అనే పాట అతని మొదటి సాంగ్. ఇక ఆ తరువాత 'ఐ' సినిమాలో 'నువ్వుంటే నా జతగా' మరింత హిట్టవ్వడంతో అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎలాంటి పాట పాడినా కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

    రెమ్యునరేషన్ ఎంత?

    రెమ్యునరేషన్ ఎంత?

    భాషతో సంబంధం లేకుండా అన్ని రాకల పాటలు పాడుతూ వస్తున్న సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఇటీవల ఆ రూమర్స్ పై సంగీత దర్శకుడు ఆర్పీ.పట్నాయక్ వివరణ ఇచ్చారు.

     ఒక్క పాటకు ఎంత తీసుకుంటారంటే?

    ఒక్క పాటకు ఎంత తీసుకుంటారంటే?

    ముందుగా సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకి 6లక్షలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఆర్పీ.పట్నాయక్ వివరణ ఇచ్చారు. నిజానికి అతను చెన్నైలోనే ఉండి పాడతాడు అంటూ ఇంతకుముందు కేవలం ఒక్క పాటకు 4 లక్షలు మాత్రమే తీసుకునేవారు అని వివరణ ఇచ్చారు. అది కూడా GSTతో కలుపుకొని అని చెప్పారు.

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
    మళ్ళీ కొంత పెంచారని అంటూ..

    మళ్ళీ కొంత పెంచారని అంటూ..

    ఇటీవల మళ్ళీ కొంత పెంచారని అంటూ.. ప్రస్తుతం సిద్ శ్రీరామ్ పాటకు GSTతో కలుపుకొని 4.50లక్షలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. అతనికి డిమాండ్ ఉంది కాబట్టి ఆ రెంజ్ లో తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పిన ఆర్పీ.పట్నాయక్ అతను వారానికి ఒక్క పాట మాత్రమే పాడతాడు అంటూ.. అది కూడా ట్యూన్ విన్న తరువాత నచ్చితేనే పాడతారని అన్నారు.

    English summary
    specially for short films, a single song is becoming the sixth life. And a singer like Sid Shriram is also very useful for movies. However, music director RP Patnaik recently made some interesting comments on his remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X