RRR దోస్తీ సాంగ్ రెడీ.. భాషకొక సింగర్‌ను సెట్ చేసిన కీరవాణి.. రిలీజ్ డేట్ ఫిక్స్!
పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్థం చెప్పిన సినిమా బాహుబలి అని అందరికి తెలిసిన విషయమే. ఇక అదే టీమ్ తో రాబోతున్న RRR సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లబోతోంది. ఏ సినిమాకైనా పాటలు మరో ఆయుధంలా నిలుస్తున్నాయి. ఇక కీరవాణి లాంటి సంగీత దర్శకుడు ఒక్కో పాటను ఒక్కో రేంజ్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక మొదటి దోస్తీ సాంగ్ ను 5 భాషల్లో విడుదల చేస్తుండగా భాషకొక సింగర్ ను సెట్ చేశారు.

ఇండియన్ సినిమా చరిత్రలోనే..
ఇండియన్ సినిమా చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా RRR సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. మొదటిసారి ఒక టాలీవుడ్ చిత్ర కోసం దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. బాహుబలి అనంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం వలన సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి.

మొదటి పాటతోనే ఫోకస్ పడాలని
ఇక సంగీత దర్శకుడు కీరవాణి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటి పాటతోనే ఫోకస్ పడాలని చాలా గ్రాండ్ గా రెడీ చేశారు. తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను అన్ని భాషల్లో అనువదించి స్థానిక సింగర్స్ తో పాడించారు. దీంతో ఎవరు బెస్ట్ అందిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

5 భాషల్లో 5 టాప్ సింగర్స్
అన్ని భాషల్లో దోస్తీ అనే సాంగ్ కామన్ లిరిక్స్ తో ఉండేదే. ఇక తెలుగులో హేమచంద్ర పాడగా, తమిళ్ లో అనిరుధ్ రవిచంద్రన్ ఆలపించారు. ఇక హిందీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది పాడారు. మళయాళంలో విజయ్ యేసుదాస్, కన్నడలో యాజిన్ నిజార్ వంటి టాలెంటెడ్ గాయకులు దోస్తీ సాంగ్ ను పాడించారు.

సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇక మొదటి సాంగ్ దోస్తీపై అంచనాలు అయితే గట్టిగానే పెరిగాయి. అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ మధ్యలో ఉండే స్నేహం బంధాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురురుచూస్తున్నారు. ఇక ఈ పాటను ఆగస్ట్ 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. మరి ఫస్ట్ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











