RRR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమైన రాజమౌళి.. ఎత్తర జెండా అంటూ.. హీరోలతో ఆలియా
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసిన RRR సినిమా మొత్తానికి మార్చి 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా మరోసారి వాయిదా పడకుండా విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళిని పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్రం యూనిట్ సభ్యులు మరోసారి స్పీడ్ పెంచారు. త్వరలోనే ఒక ప్రత్యేకమైన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అసలైతే ఆ పాటను సినిమా చివరిలో ఉంచి సర్‌ప్రైజ్ గా ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదల చేయకుండా ఉండలేకపోతున్నాము అని చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ అప్డేట్ ఇచ్చేశారు. ఇక RRR సెలబ్రేషన్స్ ఆంతేమ్ పేరుతో రాబోయే ఎప్పుడు రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే.

సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు. కానీ ఆ ప్లాన్స్ ఏమి వర్కౌట్ కాలేదు. కరోనా పరిస్థితుల కారణంగా వరుసగా ఐదు సార్లు వాయిదా పడ్డా ఈ సినిమా ఇప్పుడు ఆరోసారి సరికొత్త డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 25 వ తేదీన ఎలాంటి పోటీ లేకుండా RRR సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది.

భారీ బడ్జెట్ తో..
దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది అని అందరూ నమ్ముతున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు అన్నీ కూడా అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మరో సర్‌ప్రైజ్
సినిమా విడుదల అవుతోంది అంటే రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు అన్నీ కావు. ఇక ఇప్పుడు మార్చి 22 వ తేదీన విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్న దర్శకుడు మరోసారి ప్రమోషన్ విషయంలో డోస్ పెంచేందుకు సిద్ధమయ్యాడు. మరొక సారి పాటతో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అసలైతే ఆ పాటలు సినిమా చూసిన తర్వాత చివరలో చూపించాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు చూపించకుండా ఉండలేకపోతున్నాము అంటూ పోస్టర్ విడుదల చేశారు.

మార్చి 14వ తేదీన రిలీజ్
RRR సెలబ్రేషన్స్ ఆంతేమ్ 'ఎత్తర జెండా' అనే ఒక భావోద్వేగమైన పాటను మార్చి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అందులో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే అలియాభట్ ప్రత్యేకమైన స్టిల్స్ తో దర్శనమిచ్చారు. వీరు ముగ్గురి మధ్యలో పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా ఇదే తరహాలో..
సాధారణంగా దర్శకుడు రాజమౌళి తన సినిమాలలో ఏదో ఒక పాట ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. మగధీర సినిమాలో కూడా టైటిల్స్ పడేటప్పుడు టైటిల్ సాంగ్ లో టెక్నీషియన్స్ ను కూడా ఆ పాటలో హైలెట్ చేశాడు. ఆ తర్వాత ఈగ సినిమాలో కూడా చివరలో టైటిల్ సాంగ్ తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు RRR సినిమా లో కూడా ఎత్తర జెండా అనే సాంగ్ హైలెట్ అయ్యేలా ప్రజెంట్ చేయనున్నారు. మరి ఈ పాట ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











