RRR: అమర వీరులను తలచుకుంటూ.. నెత్తురు మరిగితే ఎత్తర జెండా వీడియో సాంగ్.. గొంతు కలిపిన రాజమౌళి!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో RRR రోజురోజుకు అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేస్తున్నారు. మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మక తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించడం అభిమానులలో ఎంతగానో ఉరిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ప్రమోషనల్ సాంగ్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. RRR సెలబ్రేషన్స్ ఆంథెమ్ అంటూ 'ఎత్తర జెండా' అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పాట ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.

ఎత్తర జెండా అనే మరో పవర్ఫుల్ సాంగ్
సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో రాజమౌళి ఏ విధంగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటలతోనే సగం బజ్ క్రియేట్ చేస్తుంటారు. ఇక రీసెంట్ గా ఎత్తర జెండా అనే మరో పవర్ఫుల్ పాటను విడుదల చేశారు. గత రెండు రోజులుగా ఈ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ పాటలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అలియా భట్ కూడా కనిపించడం విశేషం.

రాజమౌళి వాయిస్ కూడా..
అలాగే ఆ ఇద్దరు హీరోలు కూడా పాట మొదట్లోనే జాతీయ జెండా పట్టుకొని గర్వంగా ఫీల్ అవుతూ ఉండడం దానికి తోడు రాజమౌళి వాయిస్ ఓవర్ అదిరింది. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విధించిన కోడె గిత్తేల్లాంటి అమర వీరులను తలచుకుంటూ.. అని రాజమౌళి అంటే నెత్తురు మరిగితే ఎత్తర జెండా అని హీరోలు పాట అందుకున్నారు. ఈ పాట అభిమానులను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది.

గర్వించదగ్గ సినిమా..
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎం కీరవాణి స్వరపరిచారు. ఇక కీరవాణితో పాటు విశాల్ మిత్ర, పృథ్వి చంద్ర సాహితీ చాగంటి, హరిక ఇలా ప్రముఖ సింగర్స్ ఈ పాటను ఆలపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమాల్లో ఒకటైన RRR లో ఇలాంటి మంచి పాట ఉండడం మరింత గర్వకారణం అని చెప్పవచ్చు. RRR సెలబ్రేషన్స్ ఆంథెమ్ అంటూ పాటను విడుదల చేశారు.
Recommended Video

మరింత పాజిటివ్ బజ్
లిరిక్స్ లో ప్రతీ లైన్ కూడా కూడా ప్రేక్షకుల రోమాలు నిక్క పొడిచేలా ఉన్నాయి అని చెప్పవచ్చు. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త బాక్సాఫీసు రికార్డులను నమోదు చేయడం పక్కాగా అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటల అన్నిటికీ కూడా మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఎత్తర జెండా అనే పాట కూడా ఈ సినిమాపై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది. అసలైతే అయితే ఈ సినిమాలో చూసే విధంగా సినిమా చివర్లో చూపించాలని అనుకున్నారట. కానీ ముందుగానే రిలీజ్ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమా మార్చి 25వ తేదీన కేవలం ఇండియాలోనే కాకుండా పలు దేశాల భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











