Revolt of BHEEM: ఎమోషనల్ గా టచ్ చేసిన కీరవాణి తనయుడు.. సాంగ్ మామూలుగా లేదుగా..

బాహుబలి సినిమా అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం RRR. మొట్టమొదటిసారి తెలుగు సినిమా ప్రపంచంలో నందమూరి మెగా హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దర్శకుడు రాజమౌళి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర కు సంబంధించిన మరొక పాటను ను కూడా విడుదల చేశారు.

బాహుబలికి మించి..

బాహుబలికి మించి..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేక్షకులు కూడా RRR సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. డి.వి.వి.దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి బాహుబలి కి మించి తెరకెక్కించడం జరిగింది. రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 ట్రైలర్ తో భారీ క్రేజ్

ట్రైలర్ తో భారీ క్రేజ్

అయితే మొదట హీరోలిద్దరూ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. కొమరమ్ భీమ్ అల్లూరి సీతారామరాజు పాత్రల టీజర్స్ తొనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఇక ఆ తరువాత ట్రైలర్ టీజర్స్ తో ఆ డోస్ మరింత ఎక్కువయ్యింది అనే చెప్పాలి. తప్పకుండా మొదటిరోజు మొదటి షో చూడాలి అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని విజువల్స్ తో దర్శకుడు చాలా క్లారిటీగా చెప్పేసాడు.

రివోల్ట్ ఆఫ్ భీమ్

రివోల్ట్ ఆఫ్ భీమ్

ఇక నేడు ఎన్టీఆర్ కు సంబంధించిన మరొక పాటను ను కూడా విడుదల చేయడం జరిగింది. రివోల్ట్ ఆఫ్ భీమ్ పేరుతో విడుదల చేసిన కొమురం భీముడొ అనే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ లో కొమురంభీం పాత్రను ఉత్తేజ పరిచేలా ఎన్టీఆర్ వాయిస్ చాలా గాంబిర్యంగా ఉంది. పాటలో పాత్ర యొక్క అంశాలను హైలెట్ చేశారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను కీరవాణి తనయుడు కాల భైరవ పాడాడు. ఇక పాటలో కూడా కనిపించిన కాల భైరవ షాడోస్ లో మరో జూనియర్ ఎన్టీఆర్ తరహాలో కనిపించినట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రమోషన్ లో తెలివిగా..

ప్రమోషన్ లో తెలివిగా..

మొత్తానికి మరొక పాటతో కీరవాణి కూడా సినిమాపై అంచనాలను పెంచేశారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఇలాంటి పాట విడుదల చేయాలి ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అని విషయంలో ఆయనకు బాగా తెలుసు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పాట కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

 తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా

ఇక ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషకు సంబంధించిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. మరి సినిమా ఆ అంచనాలను ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X