Oscar for Naatu Naatu కృష్ణానగర్ నుంచి ఆస్కార్ వరకు.. అమెరికా వెళ్లడానికి అలాంటి కష్టాలు.. ప్రేమ్ రక్షిత్
ఆస్కార్ అవార్డు అందుకొన్న క్షణాలను మాటల్లో వర్ణించలేం. నేను కృష్ణా నగర్‌లో చిన్న రూంలో ఉండే వాడిని ఆస్కార్ వరకు వెళ్లానంటే చాలా గర్వంగా ఉంది. నమ్మలేకపోతున్నాను అని నాటు నాటు పాటకు నృత్యం సమకూర్చిన కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. మార్చి 13వ తేదీన లాస్ ఎంజెలెస్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఒరిజినల్ క్యాటగిరిలో RRR సినిమాలోని నాటు నాటు పాట అవార్డు సాధించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల వేడుక అనంతరం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..

వీసా రావడం ఆలస్యం అంటూ
ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి వెళ్లడానికి చాలా కష్టమైంది. వీసా రావడం ఆలస్యమైంది. ఆ సమయంలో నేను పుష్ప2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాను. ముందు ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు వెళ్లేందుకు అప్లై చేసుకొంటే వీసా రిజెక్ట్ చేశారు. కానీ కార్తీకేయ చాలా కష్టపడి వీసా వచ్చేలా చేశారు అని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.

5 రోజులకే వీసా మంజూరు
వీసా విషయంలో ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించారు. 9వ తేదీ కేవలం 5 రోజులకే వీసా మంజూరు చేయడం నాకు తెలిసి హిస్టరీలో మొదటిసారి అనుకొంటాను. 10వ తేదీన బయలుదేరి వెళ్లాను. 12వ తేదీన పాటకు రిహార్సల్ చేశాం. 13వ తేదీన ఆస్కార్ వేడుక జరిగింది.

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి
నాటు నాటు పాటను ఆ స్థాయికి తీసుకుపోయిన రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వంలో ఎన్నో పాటలు చేశాను. కానీ ఈ పాటకు మంచి గౌరవం దక్కడం ఆనందంగా ఉంది అని ప్రేమ్ రక్షిత్ చెప్పారు.

రిహన్నా పాటతో పోటీ పడి
ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కోసం ఐదు పాటలు నామినేట్ అయ్యాయి. అయితే వరల్డ్ పాప్ సింగర్ రిహన్నా పాడిన పాట కూడా నామినేట్ అయింది. ఆ పాట కూడా చాలా పాపులర్ అయింది. ఆ పాటతో మంచి పోటీ ఉంటుందని అనుకొన్నాను. వేడుక రోజున ఆ పాటను, మరో పాటను ప్రదర్శించారు. దాంతో నాటు నాటుకు అవార్డు వస్తుందో లేదో అని కంగారు పడ్డాను. ఒక్కసారి RRR అనే ప్రకటించగానే నా ఆనందానికి హద్దులేకుండా పోయాయి అని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.

ఆస్కార్ వేదికపై నాటు నాటు
నాటు నాటు పాటను ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఇండియన్ జానపద పాటకు దక్కిన గౌరవం అది. ఆ పాటను వేదికపై ప్రదర్శించిన తర్వాత అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ చేయడం నేను మరిచిపోలేని విషయం. నా జీవితంలో గొప్ప మధురానుభూతి. అందుకు కారణమైన రాజమౌళికి రుణపడి ఉంటాను అని ప్రేమ్ రక్షిత్ అన్నారు.


Click it and Unblock the Notifications











