గబ్బర్ సింగ్ ఆఫర్ అలా చేజారింది.. వకీల్ సాబ్‌తో ఆ డ్రీమ్ నెరవేరింది.. సీక్రెట్ బయటపెట్టిన తమన్
గతేడాది అల వైకుంఠపురం సినిమాతో బ్లాక్‌బస్టర్ సొంత చేసుకొన్న ఎస్ తమన్ మళ్లీ తన సత్తాను నిరూపించుకొనేందుకు సిద్ధమయ్యారు. ఊపిరి సలపకుండా పలు ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి తొలిసారి చేస్తున్న వకీల్ సాబ్ గురించి పలు విషయాలు పంచుకొన్నారు. వకీల్ సాబ్ ప్రమోషన్‌లో భాగంగా తమన్ మాట్లాడుతూ...

మిరపకాయ్ సినిమా తర్వాత
పవన్ కల్యాణ్‌తో కలిసి ఎప్పుడో పని చేయాల్సింది. మిరపకాయ్ సినిమా చేసిన తర్వాత గబ్బర్ సింగ్‌కు కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమాకు రాంజోగయ్య శాస్త్రితో కలిసి పాటలు చేశాం. కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమాకు పనిచేయలేకోపోయాను. పవన్‌తో ఓ కమర్షియల్ సినిమాతో ముందుకు రావాలని అనుకొన్నాను. మళ్లీ పవన్‌తో కలిసి వకీల్ సాబ్‌కు పనిచేయడం నా కల సాకరమైందని భావిస్తున్నాను అని తమన్ అన్నారు.

వకీల్ సాబ్ ఆఫర్ తర్వాత
వకీల్ సాబ్ సినిమా ఆఫర్ రాగానే దర్శకుడు వేణు శ్రీరాంతో కలిసి ఏడు రోజులు పనిచేశాను. ఈ సినిమాలో మార్పుల గురించి ప్రతీ రోజు డిస్కస్ చేశాను. ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసినట్టు డైరెక్టర్ వేణు శ్రీరాంను కలిశాను. అలా ప్రతీ సీన్ గురించి తెలుసుకొని సినిమాకు మ్యూజిక్ చేశాం అని తమన్ పేర్కొన్నారు.

కథలో భాగంగానే వకీల్ సాబ్ పాటలు
వకీల్ సాబ్ సినిమాలో పాటలు అతికించినట్టు కనిపించవు. కథకు స్టిచ్ చేసినట్టు ఉంటాయి. పవన్ కల్యాణ్ రేంజ్‌ను మిస్ కాకుండా దర్శకుడు వేణు శ్రీరాం చాలా జాగ్రత్తగా పాటలు జొప్పించారు. కథను మార్పులు చేస్తున్న సమయంలో దిల్ రాజు టీమ్ బాగా వర్క్ చేశారు అని తమన్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌తో రెండు సినిమాలు
అయితే పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా చేయాలని ఆశ ఉండేది. కానీ వకీల్ సాబ్ అవకాశం తర్వాత మరో ఆఫర్ వెంటనే వచ్చింది. అయ్యప్పనమ్ కోషియం సినిమా రీమేక్‌కు మ్యూజిక్ చేస్తున్నాను. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకొన్న తనకు రెండు సినిమాలు దక్కాయి. చాలా సంతోషంగా ఉంది అంటూ తమన్ చెప్పారు.

అయ్యప్పనమ్ కోషియంలో పవన్ పాట
వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కల్యాణ్ పడటం లేదు. కాకపోతే ఈ చిత్రంలో సెకండాఫ్‌లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. ఆ సర్‌ప్రైజ్‌కు ఫ్యాన్స్ బట్టలు చింపుకొనేంత క్రేజ్ ఉంటుంది. కానీ అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో పవన్ పాడుతారు. ఆ పాట కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాం అని తమన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications