twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొట్టి బట్టలు, చుట్టూ ముద్దుగుమ్మలు.. బ్యాడ్ బాయ్ ప్రభాస్‌.. డోస్ మాములుగా లేదు

    |

    Recommended Video

    Bad Boy Song From Saaho

    యంగ్ రెబల్ స్టార్ చుట్టూ అమ్మాయిలు చేరారు. పొట్టి బట్టలు, స్విమ్ సూట్‌లో అదరగొడుతున్న మ్యూజిక్ నడుమ ప్రభాస్‌తో చిందులేస్తున్నారు. బాడ్ బాయ్‌గా ఆ ముద్దుగుమ్మల నడుమ ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. ఇదంతా ఎక్కడంటారా? అదేనండీ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సాహో' నుంచి విడుదలైన బాడ్ బాయ్ సాంగ్‌లో. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ సాంగ్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    హాట్ హాట్‌ భామల నడుమ ప్రభాస్

    హాట్ హాట్‌ భామల నడుమ ప్రభాస్

    పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని, హాట్ హాట్‌గా కనిపిస్తున్న భామల నడుమ ప్రభాస్ ఒక్కడే ఉన్న ఈ సాంగ్‌ యూత్ ఆడియన్స్‌కి మాంచి కిక్కిస్తోంది. నిజానికి ఈ సాంగ్ నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేశారు కానీ కొద్దిసేపటి క్రితమే సామాజిక మాధ్యమాల్లో వదిలారు.

    బ్యాడ్ బాయ్.. సాహో

    బ్యాడ్ బాయ్.. సాహో

    ‘సాహో' ప్రమోషన్స్‌లో భాగంగా రెండు పాటలు ఇది వరకే విడుదల చేయగా అవి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ‘బ్యాడ్ బాయ్' అంటూ సాగే ఈ పాట మరింత కిక్కివ్వడంతో 'సాహో' సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌కి తోడు రొమాంటిక్ డోస్ కూడా యాడ్ చేశారని స్పష్టమైంది. చిత్రంలో ఈ స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌‌తో ప్రభాస్

    ఈ సాంగ్‌లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ చిందులేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై ఎవరూ స్పందించలేదు. అలాంటిది నిన్న జరిగిన ఈవెంట్‌లో ఒక్కసారిగా ఈ సాంగ్ విడుదల చేయడంతో అందరూ ఆమెను చూసి అంతా ఆశ్చర్యపోయారు.

    సాహో మూవీ

    సాహో మూవీ

    యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో విడుదల కానుంది. చిత్రంలో ప్ర‌భాస్ సరసన శ్రధ్ధాక‌పూర్‌ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి కీలక పాత్రలు పోషించారు.

    English summary
    In Saaho Pre Release Event the Bad Boy song released. Saaho is a Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor. Directed by Sujeeth and Produced by Vamsi and Pramod under UV Creations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X