For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పది మంది ఉండగా ప్రతి రోజు పండగే.. అదరగొట్టేస్తున్న టైటిల్ సాంగ్

|

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'ప్రతి రోజు పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది.

పది మంది ఉండగా ప్రతి రోజు పండగే.. అంటూ కుటుంబ నేపథ్యంలో సాగిపోతున్న ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణం, కుటుంబ విలువలు తెలిపేలా ఉన్న లిరిక్స్ అవుతున్నాయి. థమన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. శ్రీ కృష్ణ ఆలపించిన తీరు అబ్బురపరుస్తోంది. ముఖ్యంగా సత్యరాజ్ క్యారెక్టర్ ఫోకస్ చేస్తూ ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది.

 Sai Dharam Tejs Prathi Roju Pangade Title Song Released

'ప్రతిరోజూ పండగే' చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈ సినిమా ప్రారంభానికి ముందే ఈ స్క్రిప్ట్‌ని మెగాస్టార్ చూసి ఓకే చేయడం మెగా అభిమానుల్లో ఆత్రుత కలిగించే అంశం. సాయిధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చూడముచ్చటగా ఉండనున్నాయని తెలుస్తోంది. తాత మనవళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి 'ప్రతిరోజూ పండగే' సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కి ఎలాంటి హిట్ తెచ్చిపెడుతుందో!.

English summary
Suprem hero Sai Dharam Tej upcoming movie Prathi Roju Pangade with director maruthi. In movie the heroine Rashi Khanna confirmed to romance with tej. This movie release date confirmed.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more