Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
పది మంది ఉండగా ప్రతి రోజు పండగే.. అదరగొట్టేస్తున్న టైటిల్ సాంగ్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'ప్రతి రోజు పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది.
పది మంది ఉండగా ప్రతి రోజు పండగే.. అంటూ కుటుంబ నేపథ్యంలో సాగిపోతున్న ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణం, కుటుంబ విలువలు తెలిపేలా ఉన్న లిరిక్స్ అవుతున్నాయి. థమన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. శ్రీ కృష్ణ ఆలపించిన తీరు అబ్బురపరుస్తోంది. ముఖ్యంగా సత్యరాజ్ క్యారెక్టర్ ఫోకస్ చేస్తూ ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది.
'ప్రతిరోజూ పండగే' చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ సినిమా ప్రారంభానికి ముందే ఈ స్క్రిప్ట్‌ని మెగాస్టార్ చూసి ఓకే చేయడం మెగా అభిమానుల్లో ఆత్రుత కలిగించే అంశం. సాయిధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చూడముచ్చటగా ఉండనున్నాయని తెలుస్తోంది. తాత మనవళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి 'ప్రతిరోజూ పండగే' సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కి ఎలాంటి హిట్ తెచ్చిపెడుతుందో!.