Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోలో బ్రతుకే సో బెటర్ టైటిల్ ట్రాక్.. అదరగొట్టేసిన తమన్
సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ ఓ రేంజ్లో క్లిక్ అయ్యాయి. ఓటీటీలో విడుదల చేయకుండా ఇన్నాళ్లు ఎదురుచూసిన టీం మొత్తానికి బిగ్ స్క్రీన్‌లో రిలీజ్ చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. సాయి ధరమ్ తేజ్ తమన్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
సినిమా హిట్టైనా ఫ్లాపైనా కూడా తమన్ మ్యూజిక్ మాత్రం క్లిక్ అవుతుంది. అలా తమన్ అందించే పాటలు సాయి ధరమ్ తేజ్‌కు బాగానే ప్లస్ అవుతుంటాయి. హే ఇది నేనేనా అనే పాట ఇప్పటికే బాగా క్లిక్ అయింది. అలాగే బ్రేకప్ పాట కూడా బాగానే వైరల్ అయింది. తాజాగా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ బాగానే ఎమోషనల్ అయ్యాడు. తమన్‌పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు.
సోలో బ్రతుకే సో బెటర్ టైటిల్ సాంగ్‌ను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా.. విశాల్ దద్లాని ఆలపించాడు. మొత్తానికి ఈ పాటతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. పైగా నేడు నభా నటేష్ బర్త్ డే కూడా. అలా ఈ రెండు విషయాలు నేడు కలిసి వచ్చాయి. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచేశారు. సుబ్బ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.