రౌడీబేబిని ఆపేదెవరూ.. యూట్యూబ్ కట్టలు తెంచుతున్న సాయిపల్లవి!
Recommended Video

దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రస్తుతం ఊపేస్తున్న పాట రౌడీ బేబి. మారి2 చిత్రంలోని ఈ పాట ఎక్కడ చూసినా మోత మోగిస్తున్నది. అన్ని రకాల మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుదేవా కొరియోగ్రఫి అందించిన ఈ పాటకు సంగీత ప్రియులు జేజేలు పలుకుతున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ప్రస్తుతం రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నది. రౌడీ బేబీ సృష్టిస్తున్న సంచలనం గురించి...

ఫిదా పాటకు మారి2 చెక్
గతంలో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది సినిమాకు సంబంధించిన వీడియో రికార్డు ఫిదా పేరుపై ఉండేది. ఫిదాలోని వచ్చిందే పాట 200 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ పాట సాధించిన రికార్డును రౌడీబేబీ చెరిపేసింది. ఈ రెండు పాటలు సాయిపల్లవియే కావడం విశేషం.

రౌడీబేబీకి 300 మిలియన్ల వ్యూస్
గత కొద్ది నెలలుగా మారి2 సినిమాలోని పాట ట్రెండ్ అవుతున్నది. దాదాపు 300 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సాధించి అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇంకా ఈ పాట జోష్ యూట్యూబ్, సోషల్ మీడియాలో కొనసాగుతున్నది. త్వరలోనే ఈ పాట మరిన్నీ వ్యూస్ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సాయిపల్లవి స్టెప్పులకు మంచి రెస్పాన్స్
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటపై ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్‌తో మ్యాజిక్ చేశారు. ఇక ఈ పాట టిక్ టాక్ సోషల్ మీడియా యాప్‌లో స్వైర విహారం చేస్తున్నది. ఈ పాటకు ఆర్య, సాయేషా కూడా తమ పెళ్లిలో డ్యాన్స్ చేయడం మరింత వైరల్‌గా మారింది.

య్యూట్యూబ్, టిక్ టాక్‌లో హవా
ఇంత క్రేజీ పాట ఉన్న మారి2 సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ సాయిపల్లవి డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత కొద్దినెలలుగా యూట్యూబ్‌లో టాప్ స్థానంలో కొనసాగడం సాయిపల్లవి మహిమే అంటున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











