మళ్లీ ఊపేసిన సాయి పల్లవి.. ‘సారంగదరియా’ వైరల్
సాయి పల్లవి డ్యాన్సులంటే పడిపోని కుర్రకారెవ్వరూ ఉండరు. డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సాయి పల్లవి ఇప్పుడు సౌత్‌లొ మోస్ట్ డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. ఆమె గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చ అందరికీ తెలిసిందే. న్యాచురల్ బ్యూటీ అయిన సాయి పల్లవి డ్యాన్సులకు కోట్ల మంది అభిమానులున్నారు. ఆమె పాటలు, స్టెప్పులు యూట్యూబ్‌లో సంచనలం సృష్టిస్తుంటాయి.
రౌడీ బేబీ, వచ్చిండే అనే పాటలు యూట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. అందుకే సాయి పల్లవి నటించిన సినిమాలు, అందులోంచి పాటలు వస్తున్నాయంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా తాజాగా లవ్ స్టోరీ నుంచి సారంగ దరియా అనే పాట వచ్చింది. ఈ లిరికల్ వీడియోలు సాయి పల్లవి వేసిన స్టెప్పులు తెగ వైలర్ అవుతున్నాయి. సాయి పల్లవి స్టెప్పులకు మరోసారి ఫిదా అవ్వడం ఖాయమనిపిస్తోంది.

'సారంగదరియా'అంటూ సాగుతున్న పాట లిరికల్ వీడియోను తాజాగా మరో నటి సమంత విడుదల చేసింది. సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్ వాయిస్ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది. పవన్ సీహెచ్ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపునిస్తుంది. 'లవ్‌స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











