సాయి పల్లవి అస్సలు తగ్గట్లేదుగా.. సారంగదరియా మరో న్యూ రికార్డ్!
మళయాళం టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఏం చేసినా కూడా సంచలనమే అనేలా వెలుతోంది. ముఖ్యంగా ఆమె సాంగ్స్ యూ ట్యూబ్ లలో భారీ స్థాయిలో వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక చూస్తుంటే లవ్ స్టొరీ సినిమా కూడా భారీ స్థాయిలో హిట్టయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫిదా సినిమాతో శేఖర్ కమ్ములతో కలిసి ఇదివరకే ఒక వండర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు లవ్ స్టోరీతో అంతకుమించి అనేలా హిట్టు కొట్టనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ కోసమైనా కూడా సినిమా చూడాలని జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సారంగదరియా హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ సాంగ్ యూ ట్యూబ్ లో 150మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. అలాగే 1.2మిలియన్ల లైక్స్ కూడా అందుకుంది.

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటకు పవన్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. తెలంగాణ ఫోక్ సాంగ్ ఆధారంగా రాసుకున్న ఈ పాటపై పలు వివధాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ గోడవను దర్శకుడు శేఖర్ కమ్ముల అప్పుడే క్లోజ్ చేసేశాడు. ఇక లవ్ స్టొరీ సినిమాను ఇదే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తాకిడి ఎక్కువవ్వడంతో మళ్ళీ వాయిదా వేశారు. పరిస్థితి మళ్ళీ అదుపులోకి వచ్చిన తరువాతే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











