Love Story: రిలీజ్ రోజే మూవీకి అరుదైన ఘనత.. వామ్మో అక్కడ దూసుకుపోతూనే ఉందిగా!

అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య.. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. కానీ, కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో దీన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబర్ 24) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చాలా రోజులు క్రితమే ప్రారంభించారు. ఇందులో భాగంగానే పలు రకాల పోస్టర్లు, టీజర్, పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇందులోని 'సారంగ దరియా' అంటూ సాగే ఓ ఫోక్ సాంగ్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ పాట యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అద్భుతమైన పాట మరో అరుదైన మైలురాయిని చేరుకుని ఓ ఘనతను కూడా అందుకుంది.

Sai Pallavi Saranga Dariya Song Reach 325 Million Views

'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ రోజే ఓ అరుదైన ఘనతను అందుకుంది. 'దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అంటూ సాగే ఫోక్ సాంగ్‌లో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. దీంతో ఈ పాట తాజాగా 325 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న అతి తక్కువ పాటల్లో ఒకటిగా నిలిచింది. అన్నింటి కంటే ముఖ్యంగా వేగంగా 325 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి సౌతిండియా సాంగ్‌గా 'సారంగ దరియా' రికార్డు క్రియేట్ చేసింది. దీని తర్వాతి స్థానంలో కూడా సాయి పల్లవి పాట 'రౌడీ బేబీ' ఉండడం విశేషం.

తెలంగాణ పల్లె పదాలతో రూపొందిన 'సారంగ దరియా' పాటను పవన్ సీహెచ్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించింది. అలాగే, సుద్దాల అశోక్ తేజ దీనికి లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాట విడుదలైన సమయంలో కోమలి అనే ఫోక్ సింగర్ వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెతో శేఖర్ కమ్ముల చర్చలు జరపడంతో ఆమె సైలెంట్ అయిపోయారు. ఇక, సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని దాన్ని చూస్తేనే అర్థం అవుతోంది. ఈ పాట వల్లే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పుకోవచ్చు.

క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'లవ్ స్టోరీ'లో మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడదే వాళ్లను థియేటర్ల వైపునకు నడిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X